Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన ప్రోమో అదిరిపోయింది. కాగా ఫినాలే ఎపిసోడ్ లో టాప్ సెలెబ్రేటిస్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ ఇచ్చారు. తన అభిమాన హీరో కోసం అమర్ దీప్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. తనపై అభిమానికి ఉన్న పిచ్చి ప్రేమను చూసి రవితేజ నోట మాట రాలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే .. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే వేదికపై హీరో రవితేజ ని చూసి ఉప్పొంగిపోయాడు అమర్ దీప్.
రవితేజ ని చూడగానే అన్నా అంటూ పలకరించాడు. అయితే ఇంతలో హోస్ట్ నాగార్జున ‘ అమర్ నీకు రవితేజ అంటే చాలా ఇష్టం కదా. నీకు అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నా .. గేట్లు ఓపెన్ చేస్తున్నా .. ఇప్పుడు నువ్వు అన్నీ వదిలేసి వచ్చేస్తే రవితేజ నెక్స్ట్ సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తుంది. నీకు ఏడు సెకన్లు టైం ఇస్తున్న .. బిగ్ బాస్ హౌస్ లో ఉంటావా .. లేదంతే రవితేజ సినిమాలో నటిస్తావా అని అడిగారు.
కాగా అమర్ ఏమాత్రం ఆలోచించకుండా .. రవితేజ సినిమాలో ఆఫర్ కోసం బయటకు పరుగులు తీసాడు. దీంతో రవితేజ షాక్ అయిపోయారు. నాకేం మాట్లాడాలో తెలియడం లేదు అని అన్నారు. అమర్ ఆలా బయటకు వస్తుంటే అతని భార్య తేజు కన్నీళ్లు పెట్టుకుంది. ఇక అక్కడున్న వాళ్లంతా అమర్ చేసిన పనికి ఆశ్చర్యపడ్డారు. కానీ అమర్ 105 రోజులు పడ్డ కష్టం .. కప్పు గురించి ఆలోచన అంతా వదిలేసాడు.
అతని ముఖంలో బయటకు వెళ్తున్నాను అనే భాద కనిపించలేదు. రవితేజతో పై తనకు ఉన్న పిచ్చి ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నాడు అమర్ దీప్. అయితే ప్రోమో మొత్తంలో ఇదే హైలైట్ సీన్ గా నిలిచింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు ఇది కదా అభిమానం అంటే అనుకునేలా చేశాడు అమర్ దీప్. మరి నిజంగా టైటిల్ వదులుకున్నాడా? నాగార్జున ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా? అనేది చూడాలి. నిన్ను జస్ట్ టెస్ట్ చేశాను. నీకు రవితేజ మూవీలో ఆఫర్ అలానే ఉంది. టైటిల్ రేసులో కూడా ఉన్నావని చెప్పినట్లు సమాచారం.