Panchayat 3 Review: పంచాయితీ 3 వెబ్ సిరీస్ రివ్యూ…

Panchayat 3 Review:

Written By: Gopi, Updated On : May 30, 2024 10:56 am

Panchayat-3-Review

Follow us on

Panchayat 3 Review: ప్రస్తుతం ఓటిటి లో చాలా సీరీస్ లు వచ్చి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ముఖ్యంగా సినిమాల కంటే కూడా ప్రేక్షకులు సిరీస్ లను చూడడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తూన్నారు. ఇక అందులో థ్రిల్లర్ సిరీస్ లను అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక గత రెండు సీజన్లతో ఆకట్టుకున్న పంచాయతీ సిరీస్ ప్రస్తుతం “పంచాయతీ 3” తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మరి ఈ సిరీస్ ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ప్రహ్లాద్(ఫైజల్ మాలిక్)(Faisal Malik) కుమారుడు చనిపోవడం. ఇక పంచాయతీ సెక్రటరీ అభిషేక్ త్రిపాఠి పులేరా అనే గ్రామం నుంచి బదిలీ అవడంతో పంచాయతీ రెండో సిరీస్ ముగిసింది. ఇక పులేరా గ్రామానికి కొత్త సెక్రటరీగా ఒక కొత్త వ్యక్తి రావడంతో ఆ ఊరి సర్పంచ్ అయిన మంజు దేవి (నీనా గుప్తా)(Neena Gupta), ఆమె భర్త బ్రిజ్ భూషణ్ దూబే (రఘువీర్ యాదవ్)(Raghubir Yadav), ప్రహ్లాద్ సహా కొంతమంది గ్రామస్తులు కొత్త సెక్రటరీని అడ్డుకుంటారు. ఇక దాంతో ఆ సెక్రటరీ వెనక్కి పంపించి పులేరకు పాత సెక్రటరీ అయిన అభిషేక్ త్రిపాఠి ని తిరిగి సెక్రటరీ గా తెచ్చుకుంటారు. ఇక ఆ ఊర్లో ఉన్న ఒక వృద్ధురాలకి గరీబ్ అవాస్ యోజన్ కింద అభిషేక్ త్రిపాఠి ఒక ఇల్లు కట్టిస్తాడు. పూలేరా లో మళ్ళీ రాజకీయాలు మొదలవుతాయి. ఎత్తులకి పైఎత్తులు వేస్తూ సాగే ఈ రాజకీయ చదరంగంలో ఎవరు పై చేయి సాధించారు అనేది తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే…

విశ్లేషణ

దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కించిన ఈ సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఇస్తూ వాళ్ళ వాళ్ళ పరిధి దాటకుండా అతను ఈ సీరీస్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక మొత్తానికైతే ఈ సిరీస్ తో తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ పాయింట్ ను స్ట్రెయిట్ గా చెప్పే ప్రయత్నం చేస్తూనే ప్రతి సీన్ లో తన మార్క్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ మిగిలిన రెండు కూడా ఈ సీజన్ లో చాలా అత్యుత్తమమైన దర్శకత్వ ప్రతిభను కూడా చూపించాడు. క్యారెక్టర్లను ఇతను వాడుకున్న విధానం అయితే బాగుంది. సిరీస్ కొంచెం గాడి తప్పుతుంది అని అనిపించినప్పటికీ మళ్లీ తొందరగా అలర్ట్ అయి సినిమాను పడిపోకుండా ముందుకు తీసుకెళ్లాడు అయినప్పటికీ కొన్ని ఎపిసోడ్లు పింగానే నడిచాయి స్లో నరేషన్ ఉండడంతో చూసే ఆడియోనికి కొంతవరకు బోర్ అయితే కొట్టొచ్చు. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సాఫీగా అలాగే కనక చేసినట్లయితే దీనికి ఇంకా మంచి రెస్పాన్స్ అయితే వచ్చి ఉండేది. ఇక రెండు సీజన్లు సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడి మీద ఆటోమేటిగ్గా ఈ సీజన్ మీద భారీ అంచనాలైతే ఉంటాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు సిరీస్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ మొదటి రెండు సీజన్ల కంటే ఈ సిరీస్ కొంత వరకు తగ్గిందనే చెప్పాలి…ఇక మొత్తానికైతే పాయింట్ మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పేసాడు. ఇక దాన్ని ఇంకొంచెం ఎంగేజింగ్ గా చెప్తే బాగుండేది అనేది మాత్రం ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు…

Also Read: Aarambham Movie Review: ఆరంభం ఫుల్ మూవీ రివ్యూ

ఆర్టిస్టుల పర్ఫామెన్స్…

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే జితేంద్ర కుమార్, నీనా గుప్తా లాంటి నటులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా యాక్టివ్ గా నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక వాళ్ళ పాత్రలా పరిధి మేరకు ఎక్కడ తగ్గకుండా చాలా బాగా నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఫైజల్ మాలిక్, చంద్రన్ రాయ్ లాంటి నటులు కూడా సిరీస్ కి వాళ్ళ పూర్తి ఎఫర్ట్ పెట్టి చాలా బాగా నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశారు.

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ పర్లేదు అనిపించినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే అక్కడక్కడ కొన్ని సీన్లను ఎలివేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయింది. ఇక విజువల్స్ పరంగా చూసుకుంటే రొటీన్ విజువల్స్ అనిపించినప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ సీన్లలో మాత్రం కొత్త దనాన్ని ప్రదర్శిస్తూ విజువల్స్ ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. అయితే ఇందులో దర్శకుడి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉందనే విషయం మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే భారీ ఎత్తున ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోయిన ఉన్నంతలో ఓకే అనిపించేలా ఉన్నాయి…

Also Read: Raju Yadav Review: రాజు యాదవ్ ఫుల్ మూవీ రివ్యూ…

ప్లస్ పాయింట్స్

కథ
డైరెక్షన్
ఆర్టిస్టుల పర్ఫామెన్స్

మైనస్ పాయింట్స్

స్లో నరేషన్
స్క్రీన్ ప్లే ఇంకా స్ట్రాంగ్ గా రాసి ఉంటే బాగుండేది

రేటింగ్
ఈ సినిమా కి మేమిచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్

మొదటి రెండు పార్టు లా కంటే కొంచెం తగ్గిందనేది వాస్తవం…