https://oktelugu.com/

Harikatha Web Series Review: హరికథ ఫుల్ సిరీస్ రివ్యూ…

'హరికథ' అనే సిరీస్ 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది. సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : December 14, 2024 / 12:31 PM IST

    Harikatha Web Series Review

    Follow us on

    Harikatha Web Series Review: రాజేంద్రప్రసాద్ మెయిన్ లీడ్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. నిజానికి ఒక క్యారెక్టర్ కి ప్రాణం పోయాలి అంటే అది రాజేంద్రప్రసాద్ వల్లే అవుతుంది. ఈ పాత్రలో అయిన చాలా బాగా నటించి మెప్పించడమే కాకుండా ఆ క్యారెక్టర్ యొక్క ఆర్కును చెడగొట్టకుండా ఉండేలా చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఆయన మెయిల్ లీడ్ లో నటించిన ‘హరికథ’ అనే సిరీస్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది. సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఈ సినిమా కథ విషయానికి వస్తే రంగ చారి (రాజేంద్రప్రసాద్) తన టీమ్ తో ఊర్లో రోజుకు ఒక నాటకం చొప్పున నాటకాలు వేస్తూ ఉంటాడు. ఇక జనాలను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నాటకాలు వేసిన అదే రోజు దేవుడి పేరుతో మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మరి ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఎవరు ఆ మర్డర్స్ చేస్తున్నారు.ఎందుకు చేస్తున్నారు అనేది తెలియాలంటే మీరు ఈ సీరీస్ చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే ఈ సిరీస్ ని డైరెక్టర్ మ్యాగీ మొదటి నుంచి చివర వరకు చాలా ఎంగేజింగ్ గా నడిపించాడు. కథ పురాణాలను బేస్ చేసుకొని ఉండడంతో ఆ ఫ్లేవర్ లోనే సినిమాని ముందుకు నడిపించాడు. కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికి స్టార్ట్ అయింది అంటే అన్ని ఎపిసోడ్లు కూడా ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. తద్వారా ఈ సిరీస్ ని చూస్తున్నంత సేపు ప్రేక్షకుడిని ఎంగేజింగ్ గా తీసుకెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఒక సస్పెన్స్ కొలుపుతూ ఎపిసోడ్స్ ని స్టార్ట్ చేసి అదే సస్పెన్స్ తో ఎపిసోడ్ ను క్లోజ్ చేస్తూ ఉంటారు.

    ఇక మొత్తానికైతే ప్రేక్షకుల అభిరుచి మేరకు దర్శకుడు చాలా బాగా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక చివరి ఎపిసోడ్ లో ట్విస్టులు కూడా అద్భుతంగా ఉన్నాయి. థ్రిల్లర్ సిరీస్ లను ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. అయితే కొంతమంది మర్డర్స్ చూపించడం చాలా వైల్డ్ గా ఉంది.

    అలాగే కులాల ప్రస్తావన కూడా తీసుకొచ్చి దర్శకుడు దానిని సమపాళ్లలో బ్యాలెన్స్ అయితే చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సిరీస్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక దేవుడి పేరుతో చాలా కొత్త గా మర్డర్స్ జరిగినప్పుడు అవి ప్రేక్షకులను కొంతవరకు ఎంగేజ్ చేస్తూ ఉంటాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సిరీస్ అయితే ఈ రోజుల్లో వచ్చిన సిరీస్ అన్నిటికంటే కొంతవరకు బెటర్ గా ఉందనే చెప్పాలి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టీస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రంగాచారిగా రాజేంద్రప్రసాద్ చాలా అద్భుతంగా నటించాడనే చెప్పాలి. తన ఎంటైర్ కెరియర్ లో చేసిన అన్ని పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక పోలీస్ ఆఫీసర్ గా చేసిన శ్రీరామ్ కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించాడు. అలాగే మర్డర్స్ మిస్టరీలను చేదించే క్రమంలో ఆయనకు దొరికిన కొన్ని క్లూస్ తో ఆయన సినిమాని ముందుకు నడిపించాడు. దివి కూడా తన పాత్ర పరిధిలో ఒదిగిపోయి నటించింది. తను కూడా ఈ సినిమాకు చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి…ఇక మిగిలిన ఆర్టిస్టులు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అయితే చాలా ఎక్స్ట్రా ఆర్డినరిగా సెట్ అయిందనే చెప్పాలి. ప్రతి సీన్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఇచ్చారు. మొత్తానికైతే మ్యూజిక్ చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి. ఈ సినిమాటోగ్రాఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక విజువల్స్ ని చాలా అద్భుతంగా క్యాప్చర్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా కనిపించడమే కాకుండా ఎక్కడా కూడా ప్రేక్షకుడి దృష్టి పక్కకు వెళ్లకుండా ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు…పీపుల్స్ మీడియా వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి…

    ప్లస్ పాయింట్స్

    కథ
    రాజేంద్రప్రసాద్ యాక్టింగ్
    ట్విస్టులు

    మైనస్ పాయింట్స్

    మర్డర్స్ ను చాలా వైల్డ్ గా చూపించారు…
    కొన్ని సీన్స్ అనవసరం గా పెట్టరేమో అనిపించింది…

    రేటింగ్
    ఈ సిరీస్ కి మేమిచ్చే రేటింగ్ 2.5/5