Megastar Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా షూటింగ్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకొని ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే,ఒక్కేసారి యూట్యూబ్ తో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్నీ థియేటర్స్ లో ఈ సినిమా ట్రైలర్ ని ప్రత్యేకంగా అభిమానుల కోసం వేశారు..అందరూ ఊహించినట్టే ఈ ట్రైలర్ ఒక్క మెగా అభిమానులకే కాదు, ప్రతి సినీ ప్రేక్షకుడికి ఎంతగానో నచ్చేసింది..యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ని కేవలం 24 గంటల్లోనే దాదాపుగా 22 లక్షల మంది వీక్షించారు..ఇది టాలీవుడ్ లోనే ఆల్ టైం టాప్ 2 రికార్డు గా చెప్పుకోవచ్చు..వ్యూస్ అయితే బాగానే వచ్చాయి కానీ, లైక్స్ పరంగా మాత్రం ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డుని అందుకోలేకపోయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ పరంగా ఎన్ని రికార్డ్స్ సృష్టించిందో..అలాగే ఆన్లైన్ రికార్డ్స్ కూడా అదే స్థాయిలో సృష్టించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపించింది..ఈ సినిమా ట్రైలర్ కి 24 గంటల్లో దాదాపుగా 12 లక్షల లైక్స్ వచ్చాయి..ఇది టాలీవుడ్ లోనే ఒక్క ఆల్ టైం రికార్డు..ఈ సినిమా ట్రైలర్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR మూవీ ట్రైలర్ టాప్ 2 గా నిలిచింది..ఈ రెండు ట్రైలర్స్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ నిలిచింది..ఈ ట్రైలర్ కి 24 గంటలకు గాను దాదాపుగా 10 లక్షల లైక్స్ వచ్చాయి..ఈ రికార్డ్స్ లో ఒక్కదానిని కూడా ఆచార్య ట్రైలర్ క్రాస్ చెయ్యలేకపోయింది..ఈ ట్రైలర్ 24 గంటల్లో కేవలం 8 లక్షల 50 వేల లైక్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది..వ్యూస్ పరంగా టాలీవుడ్ ట్రైలర్స్ లో టాప్ 2 గా నిలిచినప్పటికీ లైక్స్ విషయం లో మాత్రం టాప్ 5 స్థానం తోనే సరిపెట్టుయికోవాల్సి వచ్చింది ఆచార్య ట్రైలర్.
Also Read: అక్కినేని ఫ్యామిలీ పై యుద్ధం ప్రకటించిన సమంత.. షాక్ లో ఫాన్స్
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి కలిసి ఒక్క పాట కే డాన్స్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ పాట మెగా అభిమానులకు కనుల పండగలాగా ఉండబోతుంది అట..ఈ పాటని ఈ నెల 20 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం..మణిశర్మ స్వర పరిచిన పాటలు ఇప్పటికే అభిమానులను మరియు ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన సంగతి మన అందరికి తెలిసిందే..యూట్యూబ్ లో ఈ పాటలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి,అలాగే 20 వ తారీఖున విడుదల అవ్వబొయ్యే పాట కూడా అద్భుతంగా ఉండబోతుంది అంట..ఈ పాటకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది..సైరా నరసింహ రెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి, #RRR లాంటి సెన్సషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ కలిసి చేస్తున్న సినిమా కావడం తో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ నెల 29 వ తారీకు వరుకు వేచి చూడాల్సిందే.
Also Read: ఎన్టీఆర్ ఫ్యామిలీ నన్ను అలా ట్రీట్ చేస్తారు.. యశ్ సంచలన వ్యాఖ్యలు
[…] Ranbir Kapoor And Alia Bhatt Wedding: సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సాంప్రదాయం బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ నుంచి మొదలుపెడితే.. తాజాగా ఈ లిస్టులో ఆలియా భట్, రన్ బీర్ కపూర్ వచ్చి చేరారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రేమ పక్షుల వివాహం గురించి హాట్ హాట్ గా చర్చ సాగుతూనే ఉంది. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. పార్టీలు ఫంక్షన్లు అంటూ ఎక్కడ చూసినా వీరే కనిపించేవారు. […]