Manchu Manoj : వీడియో: మౌనిక కొడుకంటే మనోజ్ కి ఇంత ప్రేమ..  కన్న కొడుకు కంటే ఎక్కువగా!

మౌనిక-మనోజ్ ఏడాదిన్నర పాటు చెన్నైలో ఉన్నారట. అప్పుడు ధైరవ్ వారితో ఉన్నాడు. ధైరవ్ మనోజ్ ని తండ్రిగా భావిస్తున్నాడు. మనోజ్ కి ధైరవ్ అంటే ఎంత ప్రేమో, వారి మధ్య అనుబంధం ఎలాంటిదో తెలియజేస్తూ మనోజ్ ఓ వీడియో షేర్ చేశారు. 

Written By: Shiva, Updated On : June 25, 2023 9:15 am
Follow us on

Manchu Manoj : భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్న మనోజ్ భర్తతో పాటు తండ్రి కూడా అయ్యాడు. మౌనిక మొదటి భర్త సంతానమైన ధైరవ్ రెడ్డి మనోజ్ వద్దే పెరుగుతున్నాడు. 2016లో మౌనిక బెంగుళూరుకు చెందిన గణేష్ రెడ్డి అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. కొడుకు పుట్టాక మనస్పర్ధలతో విడిపోయారు. కోర్టు అనుమతి మేరకు కొడుకు ధైరవ్ రెడ్డి మౌనిక వద్దే పెరుగుతున్నాడు. ఈ క్రమంలో విడాకులై ఒంటరిగా ఉంటున్న మనోజ్ తో ఆమె ప్రేమలో పడ్డారు. 
 
మనోజ్, మౌనికలకు చాలా కాలంగా పరిచయం ఉంది. భూమా కుటుంబం మంచు కుటుంబం మధ్య ఎప్పటి నుండో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. కొడుకు ధైరవ్ తమతోనే ఉంటాడనే ఒప్పందంతోనే మనోజ్ ని మౌనిక వివాహం చేసుకుంది. అదే సమయంలో మనోజ్ కూడా ధైరవ్ ని కన్నకొడుకుగా భావిస్తున్నాడు. మీడియా ముఖంగా ఈ విషయం చెప్పాడు. 
 
ధైరవ్ దేవుడు ప్రసాదించిన బిడ్డ, నాకు భార్యతో పాటు బిడ్డ కూడా దొరికాడని చెప్పుకొచ్చారు. ధైరవ్ కి కూడా మనోజ్ అంటే ఇష్టం. మనోజ్ తో పిల్లాడికి ముందే గట్టి అనుబంధం కలిగి ఉన్నారు. మౌనిక-మనోజ్ ఏడాదిన్నర పాటు చెన్నైలో ఉన్నారట. అప్పుడు ధైరవ్ వారితో ఉన్నాడు. ధైరవ్ మనోజ్ ని తండ్రిగా భావిస్తున్నాడు. మనోజ్ కి ధైరవ్ అంటే ఎంత ప్రేమో, వారి మధ్య అనుబంధం ఎలాంటిదో తెలియజేస్తూ మనోజ్ ఓ వీడియో షేర్ చేశారు. 
 
ఆ వీడియోలో మనోజ్, ధైరవ్ తమ పెట్ డాగ్ తో ఆడుకుంటున్నారు. కాగా మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అవుతున్నారు. మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఐదేళ్లు అవుతుంది. ఇటీవల వాట్ ది ఫిష్ టైటిల్ తో ఒక చిత్రం ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే మరి కొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయని చెప్పారు. మరి మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి…