Manoj Bajpayee: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వాళ్ళు చేసే నటనతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం మెప్పించగలుగుతారు. అలాంటి వాళ్ళలో మనోజ్ బాజ్ పాయ్ ఒకరు… సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బీహార్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ఆయన కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తినడానికి సరిగ్గా తిండి కూడా లేని పరిస్థితుల నుంచి ప్రస్తుతం ఇండియాలోనే ది గ్రేట్ నటుడి గా పేరు సంపాదించుకున్నాడు. అయితే తను కెరియర్ స్టార్టింగ్ లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా అతన్ని అవమానించారట. అయినప్పటికి ఆయన ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాడు. ఇక తనకు అవకాశాలు రాకపోవడం అలాగే చాలామంది అతన్ని హేళన చేసినట్టుగా మాట్లాడటంతో తను సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాడట…
ఒక సీనియర్ యాక్టర్ ఇచ్చిన సలహాతో తనను తాను మరోసారి మార్చుకొని ఎలాగైనా సరే సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేశాడు.నేషనల్ స్కూల్ ఆఫ్ కు దరఖాస్తు చేసిన కూడా పలుమార్లు రిజెక్ట్ అయ్యాడు… ‘సునో రే కిస్సా’ లో నటించిన ఆ పాత్ర సంతృప్తిని ఇవ్వలేదు…స్వాభిమాన్ కొంతవరకు ఉపయోగపడింది.
అందులో భాగంగానే ఆయన 1998లో చేసిన సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఇక అక్కడి నుంచి ఆయన వెను తిరిగి చూడకుండా వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రేమ కథ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఆయన ఆ తర్వాత చేసిన హ్యాపీ, వేదం లాంటి సినిమాలు తనకి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి… ఇక ఫ్యామిలీ డ్రామా సిరీస్ తో ఓటిటి ని సైతం షేక్ చేశాడు. అక్కడ కూడా తనకు ప్రత్యేకమైన స్థానం ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఏ పాత్రనైనా సరే డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడంలో మనోజ్ బాజ్ పాయ్ తర్వాతే ఎవరైనా అనేటటువంటి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.
ఇప్పుడు వైవిధ్య భరితమైన పాత్రలను పోషించడానికి సిద్ధమవుతున్నాడు… ప్రస్తుతం అతను 57 వ బర్త్ డే ను జరుపుకుంటుండటం విశేషం…అతను ఇంకా ఇలాగే చాలా బర్త్ డే లను జరుపుకోవాలని ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో చిరస్మరణీయంగా నిలిచి పోయే పాత్రలు చేస్తే చూడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు…
