Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి(SS Rajamouli) తో ఒక సినిమా చేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రీసెంట్ గానే మొదలై రెండు చిన్న షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లోని శంకర్ పల్లి లో గత రెండు మూడు రోజుల క్రితం వరకు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య ఒక పాటని చిత్రీకరించారు. దీని తర్వాత 40 రోజుల పాటు మహేష్ బాబు సమ్మర్ సెలవులు తీసుకున్నాడు. మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనే దానిపై ప్రస్తుతానికి అయితే ఎలాంటి క్లారిటీ లేదు. ఇదంతా పక్కన పెడితే రాజమౌళి సినిమా పూర్తి అయ్యాక, మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే దానిపై ఇప్పటి నుండే చర్చ మొదలైంది.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
తన తోటి స్టార్ హీరోల లాగానే పాన్ ఇండియన్ సినిమాలు చేస్తాడా?, లేకపోతే ఎప్పటి లాగానే ప్రాంతీయ బాషా కమర్షియల్ సినిమాలతోనే సరిపెడుతాడా అని అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, రాజమౌళి సినిమా పూర్తి అవ్వగానే, సందీప్ వంగ(Sandeep Reddy Vanga) తో సినిమా చేయడానికి మహేష్ బాబు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్లిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. అయితే రాజమౌళి సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో ఎవరికీ క్లారిటీ ఉండదు. అదే సమయం లో రాజమౌళి, మహేష్ సినిమా పూర్తి అయ్యే సమయానికి సందీప్ వంగ ఎవరితో సినిమా కమిట్ అయ్యి ఉంటాడో కూడా చెప్పలేం. రీసెంట్ గానే సందీప్ వంగ రామ్ చరణ్ తో ఒక సినిమా ఖరారు చేసుకున్నాడు. అదే విధంగా అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా ఖరారైంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాకనే మహేష్ సినిమా చేయాలి.
మరి రాజమౌళి మహేష్ సినిమా పూర్తి అయ్యేలోపు సందీప్ వంగ రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలను పూర్తి చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. వాళ్ళిద్దరితో సినిమాలు చేసే ముందు సందీప్ వంగ ముందు ప్రభాస్ తో ‘స్పిరిట్’, రణబీర్ కపూర్ తో ‘యానిమల్ పార్క్’ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వడానికి మూడేళ్ళ సమయం పడుతుంది. మహేష్ మాత్రం రాజమౌళి సినిమా పూర్తి అవ్వగానే సందీప్ తో సినిమా చేయాలని చాలా బలంగా ఫిక్స్ అయ్యాడు. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఈమధ్య కాలం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సందీప్ వంగ మహేష్ గురించి మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు మీరు చూసిన మహేష్ కేవలం 25 శాతం మాత్రమే. నేను మిగిలిన 75 శాతం చూపించాలని అనుకుంటున్నాను, మహేష్ క్యాలిబర్ ని నూటికి నూరు శాతం వాడుకుంటాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!