https://oktelugu.com/

Sarkaru Vaari Paata First Full Review: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ

Sarkaru Vaari Paata First Full Review : తెలుగు బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి సన్నద్ధం అయ్యింది ‘సర్కారు వారి పాట’. తెలుగు తెరపై ఇప్పటివరకు ఉన్న భారీ రికార్డులు బ్రేక్ కాబోతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను ఆల్ రెడీ చూసిన ఓవర్‌సీస్‌ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్‌ సంధు.. ఈ సినిమాకు రివ్యూ ఇస్తూ.. షాకింగ్ రేటింగ్‌ ఇచ్చాడు. ఇంతకీ ఉమైర్ సంధు రివ్యూలో ఏమి చెప్పాడంటే.. కథ : బ్యాంకింగ్ మోసాల […]

Written By:
  • Shiva
  • , Updated On : May 11, 2022 / 05:23 PM IST
    Follow us on

    Sarkaru Vaari Paata First Full Review : తెలుగు బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి సన్నద్ధం అయ్యింది ‘సర్కారు వారి పాట’. తెలుగు తెరపై ఇప్పటివరకు ఉన్న భారీ రికార్డులు బ్రేక్ కాబోతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను ఆల్ రెడీ చూసిన ఓవర్‌సీస్‌ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్‌ సంధు.. ఈ సినిమాకు రివ్యూ ఇస్తూ.. షాకింగ్ రేటింగ్‌ ఇచ్చాడు. ఇంతకీ ఉమైర్ సంధు రివ్యూలో ఏమి చెప్పాడంటే..

    Sarkaru Vaari Paata

    కథ :

    బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుంది. మహేష్ బాబు రోల్ విషయానికి వస్తే.. యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా మహేష్ బాబు కనిపిస్తాడు. తమ బ్యాంకును చీట్ చేసిన బిజినెస్‌ మెన్‌ల నుంచి తెలివిగా మహేష్ డబ్బులు ఎలా వసూలు చేస్తాడు ? ఇక అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉండే మహేష్ కళావతి (కీర్తి సురేష్)తో ఎలా ప్రేమలో పడ్డాడు ? ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అసలు మహేష్ గతం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

    Also Read: Mahesh Babu Namrata Marriage: ‘నమ్రత’ను పెళ్లి చేసుకుంది అందుకే కదా.. మహేష్ ఓపెన్ స్టేట్ మెంట్

    విశ్లేషణ :

    ‘సర్కారు వారి పాట’ మాస్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే సినిమా. ముందుగా సినిమాలో మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్, మహేష్ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రల ఎమోషన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. సెకండాఫ్ లో వచ్చే డ్రామా అండ్ కామెడీ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇది బ్లాక్‌ బస్టర్‌ మాత్రమే కాదు, ఇదొక క్లాసిక్‌ మూవీ కూడా.

    నటి నటీనటుల విషయానికి వస్తే.. మహేష్ అద్భుతంగా నటించారు. మహేష్ -వెన్నల కిషోర్ కాంబినేషన్‌ అదిరింది. కీర్తి సురేష్ క్యారెక్టర్ అయితే, ఒక సర్‌ప్రైజ్‌ ప్యాకేజీ. ఎందుకో తెలియదు.. మహేష్ ఈ సినిమాలో మరింత అందంగా కనిపించాడు. ఒక్క మాటలో ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకులు గొప్ప అనుభూతిని పొందుతారు.

    Sarkaru Vaari Paata

    ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రానికి ఉమైర్ సంధు షాకింగ్ రేటింగ్ ఇచ్చాడు. ఏకంగా ‘5’కి 4.5 రేటింగ్ ఇచ్చారు. మాస్ క్లాస్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఫుల్ గా ఉన్నాయట. ఈ చిత్రం ఫుల్ మీల్ లాంటి సినిమా అని ఉమర్ సంధు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి ఈ చిత్రం గొప్ప ట్రీట్ అట.

    తీర్పు :

    స్క్రీన్ ప్రెజెన్స్ లో తనను బీట్ చేసే వారు లేరని.. మహేష్ మరోసారి ఘనంగా నిరూపించాడు. ఇక ఈ చిత్రం ఒక ఎమోషనల్ డ్రామా.. భారీ యాక్షన్.. భారీ తారాగణం.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’ గా సాగుతూ అబ్బుర పరుస్తోంది. అలాగే, సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా మాస్టర్ పీస్‌. యాక్షన్ సన్నివేశాలతో పాటు విజువల్స్ అదిరిపోయాయి.

    Also Read:Sarkaru Vaari Paata: సర్కారివారి పాట వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

     

    Tags