Mahesh Babu Upcoming Movies: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని ‘వారణాసి'(Varanasi Movie) మూవీ మీదనే పెట్టాడు. రీసెంట్ గానే మహేష్ బాబు , ప్రియాంక చోప్రా లపై గ్రాండ్ స్కేల్ లో ఒక సాంగ్ ని చిత్రీకరించారు. ఈ పాటలో మహేష్ , ప్రియాంక స్టెప్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయట, ‘నాటు నాటు’ రేంజ్ లో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టిస్తోందట. మరి మహేష్ తో ఆ రేంజ్ స్టెప్పులంటే , ఇక థియేటర్స్ పరిస్థితి ఏంటో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ చిత్రానికి ముందు మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ కమర్షియల్ జానర్ లో తెరకెక్కినవే, పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో ఆయన ఈమధ్య కాలంలో పని చెయ్యలేదు.
మరి ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు రూట్ మారుస్తాడా?, లేకపోతే గతం లో లాగానే వరుసగా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ పోతాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మహేష్ బాబు ‘వారణాసి’ తర్వాత ‘ఏషియన్ సునీల్’ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు . డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి రివీల్ చెయ్యలేదు . అదే విధంగా మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ గా ఉన్న మరో నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’. గతంలో మహేష్ తో ఈ సంస్థ ‘శ్రీమంతుడు’, ‘సర్కారు వారి పాట ‘ వంటి చిత్రాలు నిర్మించింది. అయితే ఈ ప్రొడక్షన్ లో తెరకెక్కబోయే సినిమాకు కూడా డైరెక్టర్ ఇంకా ఖరారు కాలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కించిన బుచ్చి బాబు సనా తో మహేష్ తదుపరి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, కానీ అది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తోనేనా అనేది తెలియాల్సి ఉంది.
ఇక మూడవ చిత్రం ప్రముఖ దర్శకుడు సందీప్ వంగ తో చేయబోతున్నాడు అనే టాక్ ఉంది. కానీ ప్రస్తుతం సందీప్ వంగ ‘స్పిరిట్’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే ఆయన ‘యానిమల్ పార్క్’ చిత్రం చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా, చాలా కాలం క్రితమే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సంతకం చేసాడు. ఈ మూడు ప్రాజెక్ట్స్ అయ్యాకనే మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
