
Mahesh Babu: తెలుగు సినీపరిశ్రమలో స్టార్ హీరోల్లో మహేశ్ బాబు ఒకరు. తనదైన శైలిలో నటనలో వైవిధ్యం చూపిస్తూ సినిమా సినిమాకు తనను తాను మార్చుకుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. తెలుగు స్టేట్లే కాకుండా ఇతర భాషల్లో అభిమానులను సంపాదించుకున్న ఘనత ఆయనకే సొంతం. ఎప్పుడూ మూస పాత్రలు కాకుండా వెరైటీ పాత్రలు పోషిస్తూ తనలోని నటనకు ప్రాణం పోస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అందాల నటుడిగా ప్రశంసలు పొందుతున్నారు. గతంలో అందాల నటుడిగా శోభన్ బాబు పేరు గడించారు. ఇప్పుడు మహేశ్ బాబు వంతయింది. తన అందంతో ఎదుటి వారిని ఆకట్టుకునే మహేశ్ బాబుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే.
అయితే మహేశ్ బాబుకు సినిమాల్లోనే కాకుండా యాడ్ రంగంలో కూడా మంచి డిమాండ్ ఉంది. అప్పుడప్పుడు యాడ్స్ లలో నటిస్తూ కార్పొరేట్ కంపెనీల సెల్స్ పెంచే పనిలో పడిపోయారు. గతంలో థమ్సప్ కు యాడ్ చేసి వారి సేల్స్ లో ప్రధాన భూమిక పోషించిన ఆయన ప్రస్తుతం బిగ్ సీ కోసం అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన కోసం నిర్మాతలు క్యూ కడుతున్న నేపథ్యంలో ఆయన బిగ్ సీ కోసం అంబాసిడర్ గా ఉండేందుకు ఒప్పుకోవడంతో ఆ సంస్థ సేల్స్ కూడా పెరగనున్నాయని వారిలో విశ్వాసం పెరుగుతోంది.
ఇక మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా 70 శాతం పూర్తయిందని తెలుస్తోంది. తరువాత త్రివిక్రమ్ దర్శకత్వలో మరో సినిమా చేసేందుకు కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తరువాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసేందుకు మహేశ్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. రాజమౌళితో సినిమా అంటే ఎవరికైనా ఇష్టమే కదా. అందుకే వీరిద్దరి కలయికలో సినిమా రావాలని ప్రేక్షకులు కూడా ఆతృతగా ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా ఎన్టీఆర్, రాం, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా మైబైల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ మొదటి సారి మహేశ్ బాబు మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పుకోవడం విశేషం. ఏది ఏమైనా మహేశ్ బాబు నిర్ణయంతో బిగ్ సీ వారి విక్రయాలు పెరిగి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లనుందని పలువరు చెబుతున్నారు.
నిజానికి మహేష్ బాబు కంటే ముందు ‘బిగ్ సి’ ప్రచారకర్తగా స్టార్ హీరోయిన్ సమంత ఉండేది. ఇప్పుడు ఆమెను పక్కనపెట్టి మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్ గా కంపెనీ నియమించింది. అంటే హీరోయిన్లను మించిన అందం , క్రేజ్ మహేష్ బాబు సొంతమన్నట్టు.. ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలోనూ మహేష్ బాబును అడిగేశారు. హీరోయిన్లను అవకాశాలు దక్కకుండా అన్నీ బ్రాండ్లకు మీరే అంబాసిడర్ అవుతున్నారని విలేకరులు ప్రశ్నించారు. కానీ మహేష్ బాబు మాత్రం నవ్వి ఊరుకున్నారు. దీంతో హీరోయిన్లు కూడా మహేశ్ బాబు వ్యాపార ప్రకటనలకు మొగ్గు చూపడంపై కుళ్లుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. మాకు అవకాశాలు రావడం లేదని లోలోపల మథనపడుతున్నారట.. అదీ సంగతీ…