Mahesh Babu Family: సందు దొరికితే చాలు విదేశాలకు చెక్కేస్తారు మహేష్ బాబు. కుటుంబంతో పాటు విహరించడం మహేష్ బాబుకు ఉన్న అలవాటు. ప్రతి సినిమా స్టార్టింగ్, ఎండింగ్, వీలైతే మధ్యలో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తారు. అరాకొరా దుబాయ్ ట్రిప్ లు నెలా రెండు నెలలకు ఉంటూనే ఉంటాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో ఎక్కువగా విహరిస్తారు. తాజాగా దుబాయ్ చెక్కేశారు.
న్యూ ఇయర్ వేడుకలు మహేష్ కుటుంబం దుబాయ్ లో జరుపుకున్నారు. ఒక యాడ్ షూట్ తో కూడా పూర్తి చేసిన మహేష్ బాబు అనంతరం కుటుంబంతో చిల్ అయ్యారు. రెస్టారెంట్ భోజనం చేస్తూ సెల్ఫీలు దిగారు. మహేష్ బాబు స్వయంగా సెల్ఫీ తీశారు. సదరు ఫోటోలలో పిల్లలు గౌతమ్, సితార, భార్య నమ్రత ఉన్నారు. అలాగే మరికొందరు కుటుంబ సభ్యులు ఉన్నారు.
నమ్రత శిరోద్కర్ కి శిల్పా శిరోద్కర్ అనే సిస్టర్ ఉంది. ఆమె పెళ్లి చేసుకుని దుబాయ్ లో సెటిల్ అయ్యారని సమాచారం. ఇక ఎప్పుడు దుబాయ్ వెళ్లినా శిల్పా శిరోద్కర్ కుటుంబాన్ని వీరు కలుస్తారు. మహేష్ బాబు దుబాయ్ వెకేషన్ ఫోటోలు వైరల్ అవుతుంది. మరోవైపు మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ పూర్తి చేశారు. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. మహేష్ బాబుకు జంటగా శ్రీలీల నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్-మహేష్ కాంబోలో మూవీ వస్తుంది. మహేష్-త్రివిక్రమ్ లకు ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. థమన్ సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.