Krishna Passed Away: సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు…  వెండితెరపై ఆయనో ప్రభంజనం, సినీ ప్రస్థానం చారిత్రాత్మకం!

Krishna Passed Away: నటశేఖరుడు అస్తమించాడు. ఇండియన్ కౌబాయ్  రెక్కల గుర్రంపై నింగికేగారు. ఒక నటశిఖరం మృత్యువు మబ్బులో కనుమరుగైపోయింది. సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. మృత్యువుతో పోరాడి ఓడి ఇక సెలవన్నారు.గుంటూరు జిల్లా తెనాలి వద్ద గల కుగ్రామం బుర్రిపాలెంలో కృష్ణ మే 31 1942లో జన్మించారు. చిన్నప్పటి నుండి సినిమా అంటే పిచ్చి. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల స్ఫూర్తితో చదువు పూర్తయిన వెంటనే చెన్నై వెళ్లిపోయారు. హీరో కాకముందే ఇందిరా దేవితో ఆయనకు వివాహం జరిగింది. సినిమా వేషాల కోసం చెన్నైలో […]

Written By: NARESH, Updated On : November 15, 2022 7:45 am
Follow us on

Krishna Passed Away: నటశేఖరుడు అస్తమించాడు. ఇండియన్ కౌబాయ్  రెక్కల గుర్రంపై నింగికేగారు. ఒక నటశిఖరం మృత్యువు మబ్బులో కనుమరుగైపోయింది. సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. మృత్యువుతో పోరాడి ఓడి ఇక సెలవన్నారు.గుంటూరు జిల్లా తెనాలి వద్ద గల కుగ్రామం బుర్రిపాలెంలో కృష్ణ మే 31 1942లో జన్మించారు. చిన్నప్పటి నుండి సినిమా అంటే పిచ్చి. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల స్ఫూర్తితో చదువు పూర్తయిన వెంటనే చెన్నై వెళ్లిపోయారు. హీరో కాకముందే ఇందిరా దేవితో ఆయనకు వివాహం జరిగింది. సినిమా వేషాల కోసం చెన్నైలో నిర్మాతలు, దర్శకుల ఆఫీసుల చుట్టూ తిరిగారు. కెరీర్ బిగినింగ్ లో క్రెడిట్స్ ఇవ్వని చిన్న చిన్న పాత్రలు చేశారు. కృష్ణకు నట జీవితాన్ని ప్రసాదించిన డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు.

1965లో తేనే మనసులు చిత్రానికి ఆడిషన్స్ ఏర్పాటు చేశారు. కృష్ణ వాటికి హాజరయ్యారు. అదే ఆడిషన్స్ లో కృష్ణంరాజు కూడా పాల్గొన్నారట. తేనెమనసులు మూవీలో కృష్ణకు లీడ్ రోల్ చేసే ఛాన్స్ దక్కింది. తేనె మనసులు సూపర్ హిట్. కృష్ణ దర్శక నిర్మాతలు కంట్లో పడ్డారు. ఆరడుగుల హైట్, తెల్లని రంగు, చక్కని రూపంతో కృష్ణ బాలీవుడ్ హీరోని తలపించేవాడు. అదే ఏడాది చేసిన గూఢచారి 116 కూడా మంచి విజయం సాధించింది. కెరీర్ బిగినింగ్ లోనే ప్రయోగాత్మక చిత్రాలు చేసే అవకాశం దక్కింది.

బాపు దర్శకత్వంలో తెరకెక్కిన సాక్షి తో కృష్ణ మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అమాయకుడు పాత్రలో నటించి మెప్పించాడు. 1967 నాటికి కృష్ణ బిజీ ఆర్టిస్ట్ అయ్యారు.  ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత స్టార్ గా ఎదిగిన నటుడిగా రికార్డులకు ఎక్కాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ తో మల్టీస్టారర్స్ చేశారు.

ప్రయోగాలకు కృష్ణ పెట్టింది పేరు. మొదటి జేమ్స్ బాండ్, కౌబాయ్ చిత్రాల్లో నటించిన రికార్డు కృష్ణదే. అందుకే కృష్ణను అందరూ డేరింగ్ డాషింగ్ హీరో అంటారు. సినిమాను కేవలం వృత్తిగా కాకుండా కళగా నమ్మాడు. అందుకే సినిమా అభివృద్ధి కోసం పద్మాలయ స్టూడియో నిర్మించారు. నిర్మాతగా మారి అనేక చిత్రాలు రూపొందించారు. కృష్ణ గొప్ప దర్శకుడు కూడా. రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించిన సింహాసనం మూవీ ఆయన దర్శకత్వంలో తెరకెక్కినదే.

సినిమా రంగంలో వచ్చిన మార్పులు సాంకేతికత కృష్ణ అందిపుచ్చుకునేవారు. ఈస్ట్మన్ కలర్, సినిమా స్కోప్, 70 ఎం ఎం చిత్రాలు కృష్ణగారివే. దశాబ్దాల పాటు కృష్ణ ప్రస్థానం సాగింది. ఎందరో దర్శకులను, నటులను పరిశ్రమకు తన చిత్రాలు ద్వారా పరిచయం చేశారు.  కళామతల్లికి కృష్ణ చేసిన సేవలు అనిర్వచనీయం. గుండెపోటుకు గురైన కృష్ణను ఆదివారం అర్ధరాత్రి కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. క్రిటికల్ కండీషన్ లో ఉన్నారని గ్రహించిన వైద్యులు వెంటిలేటర్ ఏర్పాటు చేశారు. వయసురీత్యా ఆయన మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి గురయ్యారు. దీంతో ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు. కృష్ణ నేడు ఉదయం కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.