Krishnam Raju Daughter: సినిమా నిర్మాణం పెద్ద జూదం. వంద సినిమాల్లో విజయం సాధించేది రెండే అని లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇండస్ట్రీ సక్సెస్ పర్సెంట్ కేవలం 2% మాత్రమే. కాబట్టి నిర్మాతలు ఆచితూచి అడుగులు వేయాలి. కాగా దివంగత కృష్ణంరాజు కుమార్తె సినిమా నిర్మాత మారి వంద కోట్లు నష్టం తెచ్చినట్లు ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. రాధే శ్యామ్ మూవీ కారణం అంత భారీ మొత్తంలో ప్రసీద నష్టపోయారట. ప్రభాస్ లేటెస్ట్ రిలీజ్ రాధే శ్యామ్ అతి పెద్ద డిజాస్టరైన విషయం తెలిసిందే. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో మూడేళ్లకు పైగా నిర్మాణం జరిగింది. రిచ్ లొకేషన్స్ తో పాటు భారీ సెట్స్ లో చిత్రీకరణ జరిగింది.

అలాగే విఎఫ్ఎక్స్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. అంచనాల మధ్య విడుదలైన రాధే శ్యామ్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. వారం రోజుల్లోనే రాధే శ్యామ్ బాక్సాఫీస్ రన్ ముగిసింది. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రాధే శ్యామ్ కనీసం 50% పెట్టుబడి రాబట్టలేకపోయింది. ప్రభాస్ కెరీర్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన మూవీగా రికార్డులకు ఎక్కింది. కాగా ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద ఉన్నారు. యూవీ క్రియేషన్స్ తో పాటు గోపికృష్ణ మూవీస్ రాధే శ్యామ్ నిర్మించాయి.
Also Read: Kerala Bride Wedding Photoshoot: ఈ నవ వధువు పెళ్లి ఫోటోషూట్ పినరయి విజయన్ కు మొట్టికాయ వేసింది
ఇక రాధే శ్యామ్ డిజాస్టర్ కావడంతో కృషంరాజుకు దాదాపు వంద కోట్ల నష్టం వచ్చిందట. ప్రసీద నిర్ణయంతోనే రాధేశ్యామ్ నిర్మాణంలో అడుగుపెట్టిన కృష్ణంరాజు అంత భారీ మొత్తంలో నష్టపోవాల్సి వచ్చిందట. ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతగా ప్రసీద మొదటి ప్రయత్నం బెడిసి కొట్టింది. అన్నయ్య ప్రభాస్ ని నమ్మిగా గుడ్డిగా పెట్టుబడి పెట్టి బోల్తా కొట్టింది. కాగా గోపికృష్ణ మూవీస్ బ్యానర్లో భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు వంటి భారీ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. బిల్లా మూవీ కూడా ఇదే బ్యానర్లో కృష్ణంరాజు నిర్మించారు.

సెప్టెంబర్ 11న కృష్ణంరాజు అనారోగ్యంతో మరణించారు. ఈనెల 23న మొగల్తూరులో కృష్ణంరాజు దశదిన కర్మ నిర్వహించనున్నారు. 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ ఈ కార్యక్రమం కోసం మొగల్తూరు వెళుతున్నారు. దాదాపు 50 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారట. 50 మంది సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. హుటాహుటిన రోడ్లు కూడా నిర్మిస్తున్నట్లు సమాచారం. 2010 లో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు మరణించినప్పుడు ప్రభాస్ సొంతూరు వెళ్లారు. ఇక పెదనాన్న మరణం నేపథ్యంలో ప్రభాస్ ఒక నెల రోజుల పాటు షూటింగ్స్ వాయిదా వేశారు.
Also Read: Pushpa Movie Another Record: #RRR కి కూడా దక్కని అరుదైన గౌరవం ని మరోసారి దక్కించుకున్న పుష్ప
[…] […]