Krishna Kumari and Naa Anveshana : గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ‘నా అన్వేషణ'(Naa Anveshana) ఫేమ్ అన్వేష్(Anvesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న కూడా ఆయన ప్రముఖ కమెడియన్ అలీ పై విరుచుకుపడ్డాడు. అయితే అన్వేష్ చేస్తున్న కార్యక్రమాలు మంచివే. కానీ అతను మాటకు ముందు, మాటకు వెనుక అత్యంత నీచమైన భాష మాట్లాడడం పై పలువురు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ తల్లిపై అన్వేష్ చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం అతని మీదనే కాదు, మిగిలిన సెలబ్రిటీలపై కూడా ఆయన ఈ స్థాయిలో మాట్లాడుతున్నాడు. నోరు తెరిస్తే బూతులు, అందుకే ఆయన మంచి కార్యక్రమం తలపెట్టినా విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది. అన్వేష్ తీరు పై ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణ కుమారి(Krishna Kumari) చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : అన్వేష్ vs సన్నీ యాదవ్..సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ అయినంతమాత్రాన కొమ్ములుంటాయా?
ఆమె మాట్లాడుతూ ‘నువ్వు ఎంత..నీ బ్రతుకెంత..నువ్వు ఇండియా కి రా ముందు దమ్ముంటే, నీ మీద బోలెడన్ని కేసులు రెడీ అవుతున్నాయి. ఇమ్రాన్ తల్లి ఆ పని చేసింది, బయ్యా సన్నీ యాదవ్ తల్లి ఆ పని చెయ్యాలి, వీఆర్ రాజు అసలు వీడు అమ్మకు ఎలా పుట్టాడో అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు మీ అమ్మకు ఎలా పుట్టావో, అతను కూడా అలాగే పుట్టాడు. అందరూ అలాగే పుడుతారు, నువ్వేమైనా స్పెషలా?. తిప్పి గోడకేసి కొడితే రెండు ముక్కలు అవుతావు. మొన్న సజ్జనార్ గారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అంటే నువ్వేం అన్నావ్?, వండుకునేవాడికి ఒక్క కూర, అడుక్కునేవాడికి 66 కూరలు. నువ్వు అడుక్కోగానే నీ దగ్గరకి అమ్మాయిలు వచ్చేస్తున్నారు మరి. ఒక్క ముగ్గురు అమ్మాయిలు నీ దగ్గరకు వచ్చారంటే చచ్చిపోతావు. ఇతనికి ఆ బయ్యా సన్నీ యాదవ్ అంటే కడుపు మంట. ఎందుకంటే అతను కూడా ఇతని లాగానే ప్రపంచయాత్రికుడు అట. ఇతన్ని దాటేస్తుండేలోపు అక్కసు కక్కుతున్నాడు’ అంటూ ఆమె చాలా ఘాటుగా స్పందించింది.
ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి. ప్రపంచ యాత్రికుడిగా అన్వేష్ ఎంత పాపులారిటీ ని సంపాదించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇతన్ని మన టాలీవుడ్ ప్రముఖ సెలెబ్రిటీలు కూడా బాగా అనుసరిస్తూ ఉంటారు. కేవలం టూర్ వీడియోస్ మాత్రమే చేసుకుంటాడని అనుకుంటే, అన్వేష్ తనలోని ఈ కొత్త కోణాన్ని కూడా బయటపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పటి వరకు తాను యూట్యూబ్ ద్వారా 60 లక్షల రూపాయిలు సంపాదించానని, వాటిని తన కోసం ఉపయోగించానని, బెట్టింగ్ యాప్స్ ద్వారా జీవితాలను కోల్పోయిన వారి కోసం ఉపయోగిస్తానని చెప్పుకొచ్చాడు అన్వేష్. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి