Site icon OkTelugu

Kota Bommali Ps Twitter Review: కోట బొమ్మాళి పీఎస్ ట్విట్టర్ రివ్యూ: శ్రీకాంత్ సినిమాకు ఊహించని టాక్!

Kota Bommali Ps Twitter Review

Kota Bommali Ps Twitter Review

Kota Bommali Ps Twitter Review: ఈ మధ్య విలన్ రోల్స్ చేస్తున్న శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. పొలిటికల్ అంశాలు టచ్ చేస్తూ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. పోలీస్ వర్సెస్ పోలీస్ అన్నట్లు మూవీ సాగుతుందని సమాచారం. కోటబొమ్మాళి చిత్రాన్ని నూతన దర్శకుడు తేజ్ మర్ని తెరకెక్కించాడు. నవంబర్ 24న వరల్డ్ వైడ్ విడుదల చేశారు.

కోట బొమ్మాళి పీఎస్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే ముగిశాయి. సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ స్పందన తెలియజేస్తున్నారు. కొందరు సెలెబ్స్ తమ రివ్యూలు ఇవ్వడం విశేషం. దర్శకుడు హరీష్ శంకర్ కోట బొమ్మాళి సినిమా టాక్ ఏమిటో చెప్పాడు. తన షార్ట్ రివ్యూ ఇచ్చాడు. కోట బొమ్మాళి చిత్ర స్క్రీన్ ప్లే అద్భుతం. శ్రీకాంత్ గారు చాలా కాలం తర్వాత అద్భుతమైన పాత్ర దక్కించుకున్నారు. ప్రజెంట్ పొలిటికల్ సిస్టం మీద రాసిన బోల్డ్ డైలాగ్స్ కదిలిస్తాయి. మొత్తంగా సినిమా ఆకట్టుకుంది అన్నారు.

అలాగే హీరో నిఖిల్ సిద్ధార్థ్ కోట బొమ్మాళి మూవీ ఎలా ఉందో ట్వీట్ చేశారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కి ఎమోషనల్ అంశాలు కనెక్ట్ చేసి తెరకెక్కించిన విధానం బాగుంది. ఇలాంటి మూవీ నిర్మాతలను అభినందించాల్సిందే. చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అని తెలియజేశారు. అలాగే మరో దర్శకుడు శ్రీను వైట్ల స్పందించారు. కోట బొమ్మాళి పీఎస్ మూవీ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. పోలీసులను పోలీసులు ఛేజ్ చేయడం బాగుంది. శ్రీకాంత్ గారి నటన అద్భుతం. ఇతర ప్రధాన క్యాస్ట్ కూడా గొప్పగా నటించారు, అని ట్వీట్ చేశారు.

అలాగే ఓ నెటిజెన్… కోటబొమ్మాళి వంటి చిత్రాన్ని అందించిన నిర్మాతలకు ధన్యవాదాలు. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ మెమరబుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మురళి శర్మ మరొక ఆకర్షణ. దర్శకుడు తేజ హానెస్ట్ వర్క్. డైలాగ్స్ బాగున్నాయి అని రాసుకొచ్చారు. నెటిజెన్స్ అభిప్రాయంలో కోట బొమ్మాళి చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. మరి కమర్షియల్ గా ఈ మాత్రం ఆడుతుందో చూడాలి.

Exit mobile version