Site icon OkTelugu

Karan Johar: సౌత్ సత్తాను క్యాష్ చేసుకుంటున్న కరణ్ జోహార్

Karan Johar: మన సౌత్ స్టార్స్ బాలీవుడ్ లో సైతం భారీ కలెక్షన్స్ ను సాధిస్తూ అక్కడ కూడా తమకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ హీరోలు కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. అయితే, మిగిలిన బాలీవుడ్ మేకర్స్ సంగతెలా ఉన్నా.. కరణ్ జోహార్ మాత్రం సౌత్ హీరోలకు నేనున్నా అంటూ ముందుకు వస్తున్నాడు.

Karan Johar

అలా అని సౌత్ సినిమాల పై సౌత్ హీరోల పై కరణ్ జోహార్ కి ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు. కరణ్ జోహార్ పక్కా బిజినెస్ మెన్. దర్శకుడిగా నిర్మాతగా తనకేంటి ? అని పక్కా లెక్కలు వేసుకుని తనకు భారీ లాభాలు ఉన్నాయి అని ఓ అంచనాకి వస్తేనే.. కరణ్ జోహార్ ముందుకు అడుగు వేస్తాడు. ఈ క్రమంలో కరణ్ జోహార్ సౌత్ సత్తాను బాగా క్యాష్ చేసుకోవడంలో బాగా ఆరితేరిపోయాడు.

Also Read: Casting Call For Prabhas New Movie: ప్రభాస్ తో నటించాలనుందా ? ఐతే.. ఇది మీ కోసమే

హిందీలో కాస్త డిమాండ్ ఉంటుంది అంకుంటున్న ప్రతి సౌత్ సినిమా హిందీ రీమేక్ హ‌క్కుల‌కు క‌ర‌ణ్ జోహార్ కొంటున్నాడు. తక్కువ రేటుకి కొని.. హిందీలో తానే ఆయా సినిమాలకు బాగా ప్రమోషన్స్ చేసి.. చివరకు ఆ సినిమా రేంజ్ కి తగ్గట్టు లాభాలను అందుకుంటున్నాడు. బాహుబలితో మొదలైన ఈ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ వ్యాపారం ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది.

పైగా మన సౌత్ సినిమాల కోసం క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ గా కూడా మారుతున్నాడు. తాజాగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా రాబోతున్న సినిమా `కేజీఎఫ్ 2′. ఈ సినిమా పై రోజురోజుకు క్రేజ్ రెట్టింపు అవుతూ ఉంది. హిందీలో కూడా ఈ సినిమా కోసం బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇది గమనించిన కరణ్ జోహార్ మొత్తానికి ఈ సినిమా హిందీ రైట్స్ ను కూడా కొనేశాడు.

Karan Johar

హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకొవడంతో పాటు ప్రమోషన్స్ ను కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం ఓ వీడియో బాగా హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో కరణ్ జోహార్.. హీరో యశ్ సతీమణిని పిలిచి ఈ సినిమా గురించి మాట్లాడించాడు. మరో పక్క `కేజీఎఫ్ 2′ విడుదలకు ముందే రికార్డులు బద్దలుకొడుతుంది. మొన్న రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినీ లోకాన్ని ఒక ఊపు ఊపేసింది. అందుకే కరణ్ జోహార్ కూడా ఈ సినిమా కోసం బాగా హడావుడి చేస్తున్నాడు.

Also Read: RRR 9th Day Collections: రాజమౌళి నీరాజనాలతో బాక్సాఫీస్ చిన్నబోయింది

 

Exit mobile version