Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు … గుండెపోటు

Puneeth Raj Kumar: కన్నడ పవన్‌ స్టార్‌ పునీత్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌… తనదైన డాన్స్ లతో, నటనతో ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.  కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఆగ్రా హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అయితే… తాజాగా ఈ పవన్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ కు గుండె పోటు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు బెంగుళూరు లోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పునీత్‌ రాజ్‌ కుమార్ […]

Written By: Raghava Rao Gara, Updated On : October 29, 2021 1:46 pm
Follow us on

Puneeth Raj Kumar: కన్నడ పవన్‌ స్టార్‌ పునీత్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌… తనదైన డాన్స్ లతో, నటనతో ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.  కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఆగ్రా హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అయితే… తాజాగా ఈ పవన్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ కు గుండె పోటు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు బెంగుళూరు లోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం పునీత్‌ రాజ్‌ కుమార్ ఆరోగ్యం మరింత విష మించడంతో ఐసీయూ లో చికిత్స అందిస్తున్నట్లు గా సమాచారం అందుతోంది. పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఆస్పత్రిలో చేరడం పట్ల ఆయన అభిమానులు అంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారని… జిమ్‌ లో వ్యాయమం చేస్తున్న నేపథ్యంలో గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం గురించి మరిత సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

కాగా ఈరోజే పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు… భారీగా విక్రమ్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. దీంతో హాస్పిటల్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ నేపధ్యంలో పలువురు సినీ ప్రముఖులు, పోలీస్ అధికారులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు. అలాగే పునీత్ రాజ్ కుమార్ ఇంటి వద్ద కూడా భద్రత కల్పించారు. ప్రస్తుతం ఈ వార్త మీడియాలో వైరల్ గా మారింది. పునీత్ రాజ్ కుమార్ తన అన్న శివరాజ్ కుమార్ హీరోగా నటించిన బజరంగీ-2 సినిమా ఈరోజే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు సినిమా విజయం సాధించినందుకు చిత్రయూనిట్‏కు పునీత్ రాజ్ కుమార్ శుభాకాంక్షలు కూడా తెలిపారు.