Site icon OkTelugu

Kalki 2 regular shooting begins: మొదలైన ‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్..సెట్స్ లో కమల్ హాసన్,అమితాబ్ బచ్చన్..ఫోటోలు వైరల్!

Kalki 2 regular shooting begins

Kalki 2 regular shooting begins

Kalki 2 regular shooting begins: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టించిన చిత్రం ‘కల్కి 2898 AD'(Kalki 2898 AD). 2024 వ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ విజువల్ వండర్ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది . కలెక్షన్స్ గురించి కాసేపు పక్కన పెడితే , మన ఇండియన్ మైథాలజీ కి సైన్స్ ఫిక్షన్ , యాక్షన్ ని జోడించాలనే ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే , ఆ ఆలోచనని ఆచరణ రూపం లోకి తీసుకొచ్చి , వెండితెర పై గ్రాండియర్ విజువల్స్ తో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా చేసిన నాగ్ అశ్విన్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే . రాజమౌళి లాంటి డైరెక్టర్ కి కూడా ‘మగధీర’ , ‘బాహుబలి’ సిరీస్ ని తీయడానికి చాలా సినిమాల అనుభవం కావాల్సి వచ్చింది.

కానీ నాగ్ అశ్విన్ కి కేవలం రెండంటే రెండు సినిమాల అనుభవం మాత్రమే కావాల్సి వచ్చింది . అంత తక్కువ అనుభవం తో ఈ రేంజ్ విజువల్ వండర్ ని క్రియేట్ చేయడమంటే ఆయన ఎంత హోమ్ వర్క్ చేసి ఉంటాడో మీరే ఊహించుకోండి. ఇప్పుడు అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ మొదలైంది. గత కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ లోని శంకర్ పల్లి లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. నేడు ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోకి తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా అడుగుపెట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ లో కేవలం అమితాబ్ , కమల్ మీద మాత్రమే సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ప్రభాస్ కొన్ని రోజుల తర్వాత షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది .

ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం ‘ఫౌజీ’ మూవీ మీదనే ఉంది. ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన తర్వాతే ఆయన ‘స్పిరిట్ ‘, ‘కల్కి 2’ మూవీ షూటింగ్స్ లో పాల్గొంటాడు. ముందుగా ‘కల్కి 2’ చిత్రానికి అయన పది రోజుల కాల్ షీట్స్ ని కేటాయించాడట . ‘ఫౌజీ’ పూర్తి అవ్వగానే ‘కల్కి 2’ షెడ్యూల్ లో పాల్గొంటాడు ప్రభాస్. ఇకపోతే ఈ సినిమా నుండి దీపికా పదుకొనే తప్పుకోగా , ఆమె స్థానం లోకి మేకర్స్ సాయి పల్లవి ని తీసుకున్నారు. త్వరలోనే ఈమె కూడా సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Exit mobile version