Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Pawan Kalyan Ram Charan: ఒకే వేదికపై చిరంజీవి - పవన్ కళ్యాణ్ -...

Chiranjeevi Pawan Kalyan Ram Charan: ఒకే వేదికపై చిరంజీవి – పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్.. రేపు మెగా ఫ్యాన్స్ కి పండగే..

Chiranjeevi Pawan Kalyan Ram Charan: మెగా హీరోలందరిని ఒకే వేదిక పై చూసి అభిమానులకు ఎన్ని రోజులైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పుడెప్పుడో వరుణ్ తేజ్ పెళ్లి అప్పుడు వీళ్లంతా ఒకే చోట కనిపించారు , ఆ తర్వాత పలు పెళ్లి వేదికల్లో కూడా కలిసి కనిపించారు , కానీ వీళ్ళు ఒకే మూవీ ఈవెంట్ లో కనిపించి చాలా రోజులైంది. ‘సైరా నరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చివరిసారిగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కలిసి కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఆ అవకాశం రాలేదు. అయితే రేపు #Mega158 ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు రామ్ చరణ్ కూడా రాబోతున్నాడని , చిరంజీవి తో కలిసి వీళ్ళిద్దరిని రేపు మరోసారి చూడబోతున్నామని , మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.

దీంతో అభిమానులు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ #Mega158 కి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతం అందించబోతున్నాడు. ‘గాడ్ ఫాదర్’ తర్వాత తమన్ మెగాస్టార్ చిరంజీవి కి పని చేయబోతున్న చిత్రమిది. గతం లో బాబీ మెగాస్టార్ చిరంజీవి తో ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ కమర్షియల్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి ని మాఫియా డాన్ క్యారెక్టర్ లో చూపించబోతున్నారు. ఆయనకు కూతురుగా ‘ఛాంపియన్’ ఫేమ్ అనశ్వర రాజన్ నటించనుంది, అదే విధంగా మెగాస్టార్ కి జోడిగా ప్రియమణి నటించబోతుంది. చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇలా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా లో నటించలేదు , మొట్టమొదటిసారి అలాంటి పాత్రలో కనిపించబోతుండడం తో అందుకు తగ్గ హోమ్ వర్క్ కూడా చాలా గట్టిగా చేసాడు మెగాస్టార్. ఈ చిత్రం కోసం ఆయన శరీరాన్ని చాలా దృడంగా మార్చుకున్నాడు.

అందుకు సంబంధించిన వర్కౌట్ వీడియో ని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. 70 ఏళ్ళ వయస్సులో కుర్ర హీరోలకు కూడా సాధ్యం అవ్వని రేంజ్ లో మెగాస్టార్ చిరంజీవి రెడీ అయ్యాడని , నేటి తరం వాళ్ళు మెగాస్టార్ ని చూసి నేర్చుకోవలసినవి ఇలాంటివి చాలా ఉన్నాయి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని ఈ నెలలోనే మొదలు పెట్టబోతున్నారు . ఈ షెడ్యూల్ లో ముందుగా ఇంటర్వెల్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారట , చిరంజీవి తో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్ లో భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version