Site icon OkTelugu

Akhanda: అప్పటి బాలయ్యను గుర్తు చేస్తున్న ‘జై బాలయ్య’ సాంగ్​

jai balayya song

Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా కనిపించనుంది. ఈ సినిమాలో బాలయ్య మునుపెన్నడూ కనిపించని విభిన్న పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన ట్రైలర్​, పాటలు సినిమాపై మంచి హైప్​ క్రియేట్​ చేశాయి. ఇప్పటికే సింహా, లెజెండ్​ చిత్రాలతో సూపర్​ కొట్టిన బోయపాటి.. మరోసారి బాలయ్యతో హ్యాట్రిక్​ హిట్​ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పాలి.

కాగా, నిన్న జరిగిన గ్రాండ్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో ఈ సినిమా నుంచి స్పెషల్​ సాంగ్​ను రిలీజ్​ చేశారు. అదే జై బాలయ్య. అయితే, ఈ పాటతో బాలయ్య అభిమానులకు పాత రోజులు గుర్తొచ్చేలా చేసింది. థమన్ బీట్​.. దానికి బాలయ్య వేసిన స్టెప్పులు.. టాప్​ లేచిపోయేలా ఉన్నాయి. దీంతో సాంగ్​కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సమరసింహా రెడ్డి, చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య ఉత్సాహం ఈ సినిమాలో కనిపించిందని కొందరు అభిమానులు అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే డిసెంబరు 2 వరకు ఎదురు చూడాల్సిందే.

ఈ సినిమా తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఆలాగే ఆ తర్వాత యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. అదేవిధంగా కొరటాల శివతో కూడా సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

Exit mobile version