Site icon OkTelugu

Jagapathi Babu fires on Buchi Babu: డైరెక్టర్ బుచ్చి బాబు పై జగపతి బాబు ఫైర్..నాది నాకు ఇచ్చేయండి అంటూ హాట్ కామెంట్స్..

Jagapathi Babu fires on Buchi Babu

Jagapathi Babu fires on Buchi Babu

Jagapathi Babu fires on Buchi Babu: ఒక పక్క కళ్ళు చెదిరే వసూళ్లు , మరోపక్క వివాదాలతో ‘పెద్ది’ చిత్రం ప్రయాణం సాగుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయాయి. కర్ణాటక , తమిళనాడు ప్రాంతాల్లో కూడా ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఓపెనింగ్స్ సంగతి పక్కన పెడితే , తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం లాంగ్ రన్ ని చూస్తుంటే గతం లో ‘రంగస్థలం’ లాంగ్ రన్ గుర్తుకొస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెగా హీరోల సినిమాలు ఒక్కసారి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే, ఎక్కడ మొదలై , ఎక్కడ ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరని , ‘పెద్ది’ చిత్రం లాంగ్ రన్ లో కచ్చితంగా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు ఎంత గొప్ప పేరొచ్చిందో , జగపతి బాబు పోషించిన అప్పలసూరి పాత్రకు కూడా అదే రేంజ్ పేరొచ్చింది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జగపతి బాబు మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో సంచలనం గా మారాయి. తన పాత్రకు సంబంధించిన అనేక సన్నివేశాలను డైరెక్టర్ బుచ్చి బాబు తొలగించాడని , ఈ విషయం లో నేను అతనితో పెద్దగా గొడవ పడ్డానని చెప్పుకొచ్చాడు జగపతి బాబు. ఆయన మాట్లాడుతూ ‘పెద్ది , అప్పలసూరి పాత్రలకు మధ్య , అద్భుతమైన బాండింగ్ ఉన్న సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే పెద్ది చిత్రాన్ని చూసిన చాలా మంది నాతో మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్న సన్నివేశాలు ఇంకా కొన్ని ఉండుంటే బాగుండేది అనిపించిందని అన్నారు. సినిమా నిడివి దృష్ట్యా బుచ్చి బాబు వాటిని తొలగించినట్టు నాతో చెప్పాడు. కానీ నేను అతని మాటలకు ఏకీభవించలేదు , కచ్చితంగా ఆ సన్నివేశాలు అతనికి నచ్చి ఉండవు , అందుకే తీసేసి ఉంటాడు అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘గతం లో నేను ఏ సినిమాకు కూడా ఇలా మాట్లాడలేదు. కేవలం నాకు సంబంధించిన పాత్రకు న్యాయం చేశానా ?, లేదా ? అని మాత్రమే చూసుకునేవాడిని. కానీ పెద్ది లో నాకు చాలా మంచి సన్నివేశాలు పడ్డాయి. నటుడిగా నాకు పూర్తి స్థాయి సంతృప్తి ని ఇచ్చిన చిత్రమిది. కానీ నా సన్నివేశాలు కట్ చేయడం తో నాకు కోపం వచ్చింది. నా సన్నివేశాలు నాకు ఇచ్చేయండి , నేను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టుకుంటాను అని బుచ్చి బాబు కి చెప్పాను. కానీ బుచ్చి బాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. అయితే జగపతి బాబు గొడవ చేయడం వల్లో ఏమో తెలియదు కానీ , ఈ సన్నివేశాలను ఈ శనివారం నుండి సినిమాలో జత చేయనున్నారు. వీటికి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో చూడాలి.

Exit mobile version