jacqueline: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి తన నటనతో ,అందాలతో ఎంతో మంది ప్రేక్షక అభిమానులను ఆకట్టుకుంది శ్రీ లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.చిట్టియాన్ కలైయాన్ పాటకి డాన్స్ వేసి భారతదేశ వ్యాప్తి గా భాష వ్యత్యాసం లేకుండా అభిమానులకు పరిచయం అయ్యారు ఈ అమ్మడు. తెలుగులో కూడా సాహో’ నటించి గుర్తింపు పొందారు.మణికె మగే హితే’ సాంగ్ ఒక్క పాటతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది శ్రీ లంక సింగర్ యొహానీ డిసిల్వా.
ఇలా తమ ట్యాలెంట్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ శ్రీలంక ముద్దుగుమ్మలు ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. ఇద్దరూ కలిసి ‘మణికె మగే హితే’ పాటకు సరదాగా డాన్స్ చేశారు.మీరు శ్రీలంకలో ఉన్నట్లయితే యొహానీని కలవండి’అంటూ యొహానీ డిసిల్వా ట్యాగ్ చేసి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు జాక్వెలిన్ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఇటీవల హిందీ బిగ్‌బాస్ హౌస్‌లో సల్మాన్‌ఖాన్ తో కలిసి సందడి చేసింది యొహానీ “థ్యాంక్యూ గాడ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందీ యొహానీ డిసిల్వా.ప్రస్తుతం జాక్వెలిన్ ‘బచ్చన్ పాండే’, ‘ఎటాక్’, ‘రామ్‌సేతు’ సినిమాల్లో హీరోయిన్‌గా బీజిగా ఉంది పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం లో నటించనున్నారు ఈ భామ.