Site icon OkTelugu

Ritu Chaudhary: ప్రియుడితో ఓపెన్ గా తిరిగేస్తున్న జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ… ఇంతకీ ఎవరితడు!

Ritu Chaudhary

Ritu Chaudhary

Ritu Chaudhary: జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో రీతూ చౌదరి ఒకరు. ఒకప్పటి ఈ సీరియల్ నటి జబర్దస్త్ కి వచ్చాక పాప్యులర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంటారు. రీతూ చౌదరి ప్రేమ వ్యవహారం అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. గతంలో ఓ వ్యక్తిని రీతూ చౌదరి ప్రియుడిగా పరిచయం చేసింది. అతని పేరు శ్రీకాంత్. ఆయనతో రీతూ చౌదరి వివాహం దాదాపు ఖాయమే అంటూ వార్తలు వచ్చాయి. పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన శ్రీకాంత్ కొన్నాళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకోవడంతో పెళ్ళికి అంతా సిద్ధం అంటూ కథనాలు వెలువడ్డాయి.

కట్ చేస్తే ఇద్దరు మళ్ళీ కలిసి కనిపించింది లేదు. ఇటీవల రీతూ ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ చేసింది. అప్పుడు అభిమానులు శ్రీకాంత్ గురించి అడిగారు. శ్రీకాంత్ అన్నయ్యతో మాట్లాడుతున్నారా? అని అడగ్గా… ఈ విషయంపై తర్వాత వివరణ ఇస్తాను అన్నారు. మరొకరు పెళ్లి ఎప్పుడని అడిగారు. పెళ్లి చేసుకోవడం తెలివి తక్కువ చర్య అన్నట్లు సమాధానం చెప్పింది.

పెళ్లి, ప్రేమలకు దూరంగా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందనే అర్థంలో ఆమె స్పందన ఉంది . దీంతో శ్రీకాంత్ తో ఆమెకు బ్రేకప్ అయ్యిందని అందరూ భావించారు. అది జరిగిన కొద్దిరోజులకు శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. రీతూ చెప్పిన సమాధానాలకు ఆమె చర్యలకు పొంతన లేకపోవడంతో ఫ్యాన్స్ తికమక పడుతున్నారు.

తాజాగా శ్రీకాంత్ తో పాటు గుడికి వెళ్లిన వీడియో షేర్ చేసింది. దీంతో శ్రీకాంత్-రీతూ బంధం కొనసాగుతుందని స్పష్టత వచ్చింది. అది ఎప్పటి వరకు అనేది సస్పెన్సు. పెళ్లి చేసుకుంటారా? లేక డేటింగ్ చేసి ఎవరి దారి వారు చూసుకుంటారా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇటీవల రీతూ చౌదరి తండ్రి అకాల మరణం పొందారు. రీతూని ఈ సంఘటన కృంగదీసింది. ఒక టీవీ షోలో తండ్రిని తలచుకుని కన్నీరు మున్నీరు అయ్యింది.

Exit mobile version