HBD NTR: బర్త్ డే బాయ్ ఎన్టీయార్ తెలుగు నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం వెనక ఇంత కష్టం ఉందా..?

'స్టూడెంట్ నెంబర్ వన్' సినిమాతో తన సత్తా చాటుకొని వరుసగా ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు. ఇక సింహాద్రి సినిమాతో అయితే అప్పుడున్న స్టార్ హీరోలందరికీ పోటీనిస్తూ భారీ రికార్డ్ లను కూడా క్రియేట్ చేశాడనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : May 20, 2024 12:21 pm

Interesting Facts About Jr NTR Movies

Follow us on

HBD NTR: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీకి పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ‘నిన్ను చూడాలని ‘ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కొద్దిగా నిరాశ చెందాడు. అయినప్పటికీ ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తన సత్తా చాటుకొని వరుసగా ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు. ఇక సింహాద్రి సినిమాతో అయితే అప్పుడున్న స్టార్ హీరోలందరికీ పోటీనిస్తూ భారీ రికార్డ్ లను కూడా క్రియేట్ చేశాడనే చెప్పాలి…

ఇక మధ్యలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. నా అనుకున్న వాళ్లే ఆయనను మోసం చేశారు. అయిన కూడా ఒంటరి పోరాటం చేసి నిలబడ్డాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు అంటే ఆయనకున్న టాలెంట్ కి ఈ స్టార్ డమ్ అనేది నిదర్శనం అనే చెప్పుకోవాలి. ఇక డ్యాన్స్ లను ఇరగదీసే ఎన్టీఆర్ ఎలాంటి స్టెప్పులనైనా సరే అలవోకగా వేస్తూ, తనలాంటి గ్రేస్ తో డ్యాన్స్ వేసే హీరో మరొకరు ఇండస్ట్రీలో లేరు అనేలా తన సత్తాని చాటుకున్నాడు. ఇక ఎలాంటి డైలాగ్స్ ను అయిన సింగిల్ టెక్ లో చెప్పే ఏకైక హీరో కూడా ఈయనే కావడం విశేషం…ఇక హీరో అవ్వకముందు చాలా కష్టాలను కూడా ఎదుర్కొన్నాడు. నందమూరి ఫ్యామిలీ లో ఉన్న వాళ్ళంతా తన వాళ్లే అయిన ఈయనను వాళ్ళతో కలుపుకునే వాళ్ళు కాదు. ఇక అదే కసి తో ఎన్టీయార్ ఎలాగైనా సరే ఇండస్ట్రీలో ఎదిగి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించు కోవాలనుకున్నాడు.

తను అనుకున్నట్టుగానే ఇప్పుడు పాన్ ఇండియాలో వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను అయితే సంపాదించుకున్నాడు. దీంతో ఏకంగా బాలీవుడ్ లో కూడా ‘వార్ 2 ‘ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ చరిష్మా తెలిసిన బాలీవుడ్ వాళ్ళు ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి సినిమా చేస్తే భారీ వసూళ్లను రాబడుతుందనే ఒకే ఒక ఉద్దేశ్యం తో అతన్ని వాళ్ళ సినిమాలో చేర్చుకున్నారు. నిజానికి త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ రేంజ్ లో సక్సెస్ ను అందుకున్న ఎన్టీఆర్ ఇక దేవర సినిమాతో మరోసారి అదే రేంజ్ లో భారీ సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నిన్న దేవర సినిమా నుంచి ఫియర్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు.

ఇక ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ ను సంపాదించుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కి సాధ్యం కానీ రీతిలో టెంపర్ నుంచి త్రిబుల్ ఆర్ వరుసగా 6 సక్సెస్ లను అందుకున్నాడు. ఇక దేవర తో సక్సెస్ సాధిస్తే ఆయన వరుసగా 7 హిట్లు నమోదు చేసుకున్న ఈ జనరేషన్ స్టార్ హీరో గా గుర్తింపు పొందుతాడు…