https://oktelugu.com/

Actor Sai Kiran: భార్యకు విడాకులు.. ‘వదిన’ మెడలో తాళి.. అది కూడా 46 ఏళ్లకు.. ఈ హీరో లైఫ్ అంతా ట్విస్ట్ లే..!

నటుడు సాయి కిరణ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా గుర్తింపు సంపాదించాడు. సపోర్టింగ్ యాక్టర్ గా రాణించాడు. ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఆమె వరుసకు కూడా..

Written By:
  • Mahi
  • , Updated On : November 12, 2024 / 01:22 PM IST

    Sai Kiran

    Follow us on

    Actor Sai Kiran: సెలబ్రెటీల వ్యక్తిగత జీవితం (అందరివీ కావు) చాలా వింతగా అనిపిస్తుంది. మేము ఆ పని చేస్తే నలుగురు ఏమనుకుంటారన్న కనీసం ఆలోచించరేమో. పెళ్లి చేసుకోవడం విడాకులు ఇవ్వడం., మళ్లీ పెళ్లి, అది కూడా అలాగైతే మళ్లీ విడాకులు.. మళ్లీ పెళ్లి.. ఇదే కొనసాగుతోంది. మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకున్న నటులు, మటీమణులు, బిజినెస్ మ్యాన్లు లేకపోలేదు. ఇక వీరి వరుసలు కూడా చాలా వింతగా అనిపిస్తాయి. భార్యకు విడాకులు ఇచ్చి సొంత ఇంట్లో నుంచి లేదంటే భార్య కుటుంబంలో నుంచే మరో అమ్మాయికి తాళి కడతారు. ఇలాంటిదే ఒక నటుడు లైఫ్ లో జరిగింది. భార్యకు విడాకులిచ్చి వరుసకు వదిన అయ్యే నటి మెడలో తాళి కట్టేందుకు రెడీ అయ్యాడు. ఆ నటుడు ఎవరో కాదు సాయి కిరణ్. అవును మీరు విన్నతి నిజమే… సాయి కిరణ్ గురించి సీరియల్స్ చూస్తున్న యంగ్ జనరేషన్ కు సినిమాలు చూసిన కొంచెం ఓల్డ్ జనరేషన్ కు తెలుసు. 2000లో ‘నువ్వే కావాలి’లో హీరోగా తరుణ్‌కు ఎంత గుర్తింపు వచ్చిందో.. సపోర్టింగ్ యాక్టరైన సాయి కిరణ్ కు కూడా అంతే గుర్తింపు దక్కింది. మరీ ముఖ్యంగా ‘అనగనగా ఆకాశం ఉంది’ అనే పాట ఎక్కడ వినిపించినా సాయి కిరణే గుర్తొస్తాడు. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించాడు. ఇంకా సీరియల్స్ లో కూడా కనిపిస్తున్నాడు.

    నువ్వే కావాలి తర్వాత అవకాశాలు బాగానే వచ్చినా.. పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. డార్లింగ్ డార్లింగ్, జగపతి, కానీ, గోపీ ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ కావడంతో సాయి కిరణ్ కెరీర్ బ్యాక్ కు వెళ్లింది. దీంతో తనకు సినిమా ఆఫర్స్ రావడం తగ్గాయి. ఇదే సమయంలో సీరియల్స్‌లో అవకాశాలు రావడంతో అటు వైపునకు వెళ్లారు. సీరియల్స్‌లో కొంత కాలం ఏకచక్రాధిపత్యం కొనసాగించారు. ఏ ఛానల్‌ సీరియల్ అయినా సాయి కిరణ్ ఉండాల్సిందే అన్నంగా పాపులర్ అయ్యాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సీరియల్స్ లో కూడా నటించాడు.

    2010లో వైష్ణవి అనే అమ్మాయిని సాయి కిరణ్ వివాహం చేసుకున్నాడు. వీరికి పాప ఉంది. గత కొంతకాలంగా వీరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తాజాగా రెండో పెళ్లి గురించి ప్రకటన చేశాడు. ఈ సారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నది ‘వదిన’తో కావడం విశేషం. తనతో పాటు ‘కోయిలమ్మ’ సీరియల్‌లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం అయ్యింది. ఈ సీరియల్‌లో స్రవంతి సాయి కిరణ్‌కు వదినగా నటించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.