House of the Dragon Season 2 : హౌస్ ఆఫ్ డ్రాగన్స్’ సీజన్ 2 రివ్యూ: ఏం గ్రాఫిక్స్ రా బాబు నరాలు కట్ అయిపోయాయి…

ఇక హెచ్ బి ఓ మాక్స్, జియో సినిమాల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అయింది...మరి మొదటి పార్ట్ ను మించి ఈ సీజన్ సక్సెస్ అవుతుందా అనేది తెలియాలంటే ఈ సీజన్ అన్ని పార్టులు రిలీజ్ అయితే గాని క్లారిటీగా చెప్పలేము..

Written By: NARESH, Updated On : May 16, 2024 8:19 am

House of the Dragon Season 2

Follow us on

House of the Dragon Season 2 : ప్రస్తుతం ఓటిటిలో వెబ్ సీరీస్ లా హవా కొనసాగుతుంది. ఇక మనం ఎంతసేపు ఇండియన్ వెబ్ సిరీస్ ల గురించి మాట్లాడుకుంటున్నాం తప్ప, హాలీవుడ్ లో వచ్చిన సీరీస్ లా గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. నిజానికి హాలీవుడ్ వాళ్ళు తీసే సిరీస్ లు చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉంటాయి. వాళ్ల విజన్ కి తగ్గట్టుగా ఆ బడ్జెట్ ని సమకూర్చుకొని, ఎక్కడ తగ్గకుండా గ్రాఫిక్స్ కూడా ఆడ్ చేసుకుంటూ వాళ్లు సిరీస్ లు చేస్తూ ఉంటారు.

ఇక వాళ్ళు సీరీస్ లు ప్రపంచం లో ఉన్న ప్రేక్షకులందరిని కూడా విపరీతంగా మెప్పిస్తూ ఉంటాయి. ఇక ప్రపంచంలోనే అద్భుతంగా ఉన్న వెబ్ సిరీస్ లా లిస్టు కనక తీసినట్లైతే అందులో కచ్చితంగా మొదటి ప్లేస్ సంపాదించుకునే వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది ‘గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్ అనే చెప్పాలి. ఇక ఈ సిరీస్ కి సంబంధించిన సీజన్ లు 2011 నుంచి 2018 మధ్యలో వచ్చాయి. ఇక మొత్తం ఇవి ఎనిమిది సీజన్లు గా రాగా, అవన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి మంచి విజయాలను సాధించాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు దీనికి ఫ్రీక్వల్ గా ‘హౌస్ ఆఫ్ డ్రాగన్’ పేరుతో మరొక సిరీస్ రాబోతుంది. ఇక దీనికి సంబంధించిన మొదటి సీజన్ 2022వ సంవత్సరంలో వచ్చింది. ఇక ఇది కూడా దాదాపు చాలామంది ని మెప్పించడమే కాకుండా చాలా ఎక్కువ సంఖ్యలో అభిమానులను కూడా సంపాదించుకుంది. ఇక దానికి సంబంధించిన రెండోవ సీజన్ ని తొందర్లోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక అందులో భాగంగానే రీసెంట్ గా దానికి సంబంధించిన ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ ఈ ట్రైలర్ ను చూసిన సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…

అయితే ఎవరి మాట ఎలా ఉన్నా కూడా ఈ ట్రైలర్ ని చూస్తుంటే మాత్రం చాలా గ్రాండీయర్ గా ఉండటమే కాకుండా ఇందులో స్టోరీని కూడా చాలా బలంగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిజానికైతే ఇది ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ యాక్షన్ సీక్వెన్స్ కి చాలా హోప్ ఉన్న సిరీస్ గా తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో క్యారెక్టరైజేషన్స్ ను కూడా చాలా క్లారిటీ గా క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక గ్రాఫికల్ షాట్స్ కూడా చాలా అద్భుతంగా ఉండనున్నట్టుగా ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సిరీస్ మేకర్స్ మరోసారి ఈ సిరీస్ తో ప్రేక్షకులను మెప్పించబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ సిరీస్ జూన్ 16 నుంచి ఒక్కొక్కవారం ఒక్కో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక హెచ్ బి ఓ మాక్స్, జియో సినిమాల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అయింది…మరి మొదటి పార్ట్ ను మించి ఈ సీజన్ సక్సెస్ అవుతుందా అనేది తెలియాలంటే ఈ సీజన్ అన్ని పార్టులు రిలీజ్ అయితే గాని క్లారిటీగా చెప్పలేము…