https://oktelugu.com/

Shamili: ఏంటి.. ఈమె హీరోయిన్ షామిలినా.. ఇలా మారిపోయిందేంటి..

Shamili: ఓయ్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన ముద్దుగుమ్మ షామిలి. ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా కూడా చేసిందండోయ్‌. అంజ‌లి అంజ‌లి అంజ‌లి మెరిసే న‌వ్వుల పువ్వుల జాబిలి అంటూ అంద‌రితో పాట పాడించింది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు ఆమె గురించి ఎందుకు అంటారా.. అక్క‌డికే వ‌స్తున్నాం ఆగండి. హీరోయిన్‌కు ఫిట్ నెస్ అనేది ఎంత ముఖ్య‌మో మనంద‌రికీ తెలిసిందే క‌దా. అయితే షామిలి కూడా మొద‌ట్లో బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంది. ఆమె బొద్దుగా ఉంద‌ని […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 10, 2022 / 10:58 AM IST
    Follow us on

    Shamili: ఓయ్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన ముద్దుగుమ్మ షామిలి. ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా కూడా చేసిందండోయ్‌. అంజ‌లి అంజ‌లి అంజ‌లి మెరిసే న‌వ్వుల పువ్వుల జాబిలి అంటూ అంద‌రితో పాట పాడించింది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు ఆమె గురించి ఎందుకు అంటారా.. అక్క‌డికే వ‌స్తున్నాం ఆగండి. హీరోయిన్‌కు ఫిట్ నెస్ అనేది ఎంత ముఖ్య‌మో మనంద‌రికీ తెలిసిందే క‌దా.

    Shamili

    అయితే షామిలి కూడా మొద‌ట్లో బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంది. ఆమె బొద్దుగా ఉంద‌ని కొంద‌రు అంటే.. హీరోయిన్‌కు ఉండాల్సిన లుక్స్ లేవ‌ని, ముఖం క‌ల‌గా లేదంటూ చాలామంది ట్రోల్స్ చేశారు. అయితే ఇప్పుడు వారంద‌రికీ షాక్ ఇచ్చేసింది. క‌ఠిన మైన వ‌ర్కౌట్స్ తో స‌న్న‌గా నాజూగ్గా మారిపోయి.. వావ్ అనిపించేలా త‌యార‌యింది ఈ హాట్ బ్యూటీ.

    Also Read: Balakrishna Akhanda Movie: అఖండ కృతజ్ఞత సభ.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే

    ఆమె త‌న రెండో సినిమా నాగ‌శౌర్య‌తో క‌లిసి అమ్మమ్మగారిల్లు మూవీలో న‌టించింది. కానీ రెండు సినిమాలు చేసి ప‌ర్వాలేద‌నిపించుకున్నా కూడా.. ఆమెను హీరోయిన్ గా పెద్ద‌గా ఎవ‌రూ గుర్తించ‌లేదు. కానీ త‌న‌ను తాను మార్చుకుని సూప‌ర్ ఫిజిక్‌ను సొంతం చేసుకుంది. ఈ షామిలి ఎవ‌రో కాదండోయ్‌.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని చెల్లెలే. రీసెంట్ గా అజిత్ ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

    Shamili

    అయితే ఈ ఫ్యామిలీ ఫొటోల్లో షామిలీ కూడా ఉండ‌టం చూసి అంద‌రూ గుర్తుప‌ట్ట‌లేక‌పోతున్నారు. ఏంటి… ఈమె షామిలీనా అంటూ కామెంట్లు పెట్టేంత‌లా ఆమె మారి చూపించింది. స్లీవ్ లెస్ బ్లౌస్ తో పాటుగా.. అంద‌మైన చీర‌లో జుట్టు ముడేసుకుని ముద్దుగుమ్మ‌లా మెరిసిపోతోంది ఈ భామ‌. కాగా స‌న్న‌బ‌డ‌టంతో.. కొంద‌రు మ‌రో ర‌కంగా కామెంట్లు చేస్తున్నారు. మునుప‌టి అందం పోయిన‌ట్టు ఉంద‌ని కూడా అంటున్నారు. మ‌రి ఇంత క‌ష్ట‌ప‌డి స‌న్న‌గా మారిన ఈ భామ‌కు సినిమాల్లో ఏ మేర‌కు అవ‌కాశాలు వ‌స్తాయో చూడాలి.

    Tags