Bigg Boss 5 Telugu: షాకింగ్ సర్వే బిగ్ బాస్ విన్నర్ అతడే… యాంకర్ రవి ప్లేస్ తెలిస్తే షాక్ అవుతారు

Bigg Boss 5 Telugu: అనతి కాలంలోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైంది బిగ్ బాస్ షో. బుల్లితెర ఆడియన్స్ ఈ షోని బాగా ఫాలో అవుతున్నారు. షో కి ఉన్న డిమాండ్ రీత్యా పలు సంస్థలు కంటెస్టెంట్స్ పై సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎవరు ఫైనల్ కి వెళతారు? టైటిల్ ఎవరు గెలుచుకుంటారు? ఈ వారం ఎలిమినేటయ్యేది ఎవరు? వంటి అంశాలపై పోల్స్ నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ రిజల్ట్ వచ్చినట్లు తెలుస్తుంది. […]

Written By: Shiva, Updated On : November 22, 2021 3:04 pm
Follow us on

Bigg Boss 5 Telugu: అనతి కాలంలోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైంది బిగ్ బాస్ షో. బుల్లితెర ఆడియన్స్ ఈ షోని బాగా ఫాలో అవుతున్నారు. షో కి ఉన్న డిమాండ్ రీత్యా పలు సంస్థలు కంటెస్టెంట్స్ పై సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎవరు ఫైనల్ కి వెళతారు? టైటిల్ ఎవరు గెలుచుకుంటారు? ఈ వారం ఎలిమినేటయ్యేది ఎవరు? వంటి అంశాలపై పోల్స్ నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ రిజల్ట్ వచ్చినట్లు తెలుస్తుంది.

నవంబర్ 13 నుండి 19వరకు టైటిల్ విన్నర్ ఎవరు? అనే సర్వే నిర్వహించగా… అనూహ్యంగా మొదటి స్థానం షణ్ముఖ్ కి దక్కిందట. బిగ్ బాస్ ఆడియన్స్ లో అధికులు షణ్ముఖ్ టైటిల్ విన్నర్ అవుతారన్న అభిప్రాయం వెల్లడించారు. ఇక ఫైనల్ లో టైటిల్ కోసం పోటీపడేది సన్నీ అని ప్రేక్షకులు తేల్చారు. విమర్శలు వస్తున్నా మొదట్నుంచి అటాకింగ్ గేమ్ ఆడుతున్న సన్నీ రెండవ స్థానంలో ఉన్నారట. షణ్ముఖ్ తర్వాత ఎక్కువ మంది ఆడియన్స్ సన్నీ విజేతగా నిలుస్తాడని చెప్పారట.

మొదట్లో యాంకర్ రవి దే బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ అనుకున్నారు. అయితే అనూహ్యంగా అతడు గేమ్ లో వెనుకబడినట్లు తెలుస్తుంది. రవికి ప్రేక్షకులు కేవలం మూడవ స్థానం ఇచ్చారట. సన్నీ కంటే కూడా రవికి తక్కువ ఓట్లు రావడం ఊహించని పరిణామమే. ఇక తర్వాతి రెండు స్థానాలు శ్రీరామ్, మానస్ కి దక్కాయి. ఆ సర్వే ప్రకారం షణ్ముఖ్, సన్నీ, రవి, శ్రీరామ్, మానస్ ఫైనల్ కి వెళతారు.

Also Read: Sai Pallavi: హీరోయిన్​గా సాయిపల్లవి చెల్లెలు ఎంట్రీ.. ఫస్ట్ లుక్​ కూడా వచ్చేసింది

అయితే మరో నెల రోజుల గేమ్ మిగిలి ఉండగా పరిణామాలు ఎలాగైనా మారవచ్చు. కాబట్టి ఈ సర్వే వంద శాతం కరెక్ట్ అవుతుందని చెప్పలేము. ఇక ఈ వారం అనీ మాస్టర్ ఎలిమినేటై వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌస్ లో రవి, ప్రియాంక, కాజల్, సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, మానస్, సన్నీ ఉన్నారు.

Also Read: Rajamouli: పవన్​ కళ్యాణ్​తో రాజమౌళి భేటీ.. ఆ విషయంపైనే చర్చించనున్నారా?

Tags