Site icon OkTelugu

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరు డెడికేషన్ చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!!

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రేక్షకులకు ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు చేసిన ఆయన హీరోగా సంచలనం సృష్టించారు. తన నటనతో, డాన్సులతో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ మూవీల్లో నటించిన చిరు.. ఒక తరాన్ని తన డాన్సులతో ఆలరించారని చెప్పుకోవచ్చు. ఆయన కొడుకు రామ్ చరణ్ హీరోగా వచ్చినప్పటికీ ఆయన కూడా అదే క్రేజ్ తో ఇంకా ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 150 కి చిత్రాలు నటించారు.. ఇంకా కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

సినిమా కోసం అందులో తన పాత్ర కోసం ఎంతటి కష్టాన్ని అయినా భరించేందుకు చిరంజీవి సిద్ధంగా ఉంటారట. ఆయన డెడికేషన్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. డైరెక్టర్ కోడి రామకృష్ణ చిరంజీవి హీరోగా అంజి అనే సినిమాను ప్లాన్ చేశారు. ఇది 1997 లో ప్రారంభం కాగా 2004 లో విడుదలైన సంగతి తెలిసిందే.

అంజి మూవీ కోసం హాలీవుడ్ తరహాలో గ్రాఫిక్స్ ను వినియోగించారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ లో చిరు మాసిపోయిన చొక్కాను ధరించాలి.. అయితే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి డైరెక్టర్ కు రెండు సంవత్సరాలు పట్టిందంట. దీంతో ఈ సీన్ కోసం రెండు సంవత్సరాలు ఉతకకుండా ఒకే షర్ట్ ని చిరు వేసుకున్నారని తెలుస్తోంది.. మొత్తం పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఒక సినిమా అందులోనూ ఓ పాత్ర కోసం చొక్కాను రెండేళ్లు వాడటం అనేది అంత చిన్న విషయం ఏం కాదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. సినిమా మీద చిరు కు ఉన్న డెడికేషన్ ఎలాంటిదనేది.

Exit mobile version