Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళు రాసుకున్న కథలతోనే సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఒకప్పుడు రాఘవేంద్రరావు లాంటి దర్శకుడు వేరే వాళ్ళు రాసిన కథతో సినిమాలు చేసి మంచి సక్సెస్ లను అందుకున్నాడు.కానీ ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ మాత్రం వాళ్లే కథలను రాసుకొని సినిమాలు చేస్తున్నారు. నిజానికి ఎవరు రాసుకున్న కథని వాళ్లయితేనే బాగా తీయగలరు.
ఇక ఇదిలా ఉంటే వేరే భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలని మన తెలుగులో తీసి మంచి సక్సెస్ లను అందుకున్న దర్శకులు కొంతమంది ఉన్నారు. అందులో ప్రస్తుతం హరీష్ శంకర్ రీమేక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేసిన గబ్బర్ సింగ్,గద్దల కొండ గణేష్, ప్రస్తుతం రవితేజ చేస్తున్న మిస్టర్ బచ్చన్ అలాగే చిరంజీవితో చేయబోయే సినిమా కూడా రీమేక్ సినిమానే కావడం విశేషం…మరి ఈయన ఎందుకు రీమేక్ సినిమాలను ఎక్కువగా చేస్తున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు.
నిజానికి హరీష్ శంకర్ ఒక కమర్షియల్ డైరెక్టర్ ఆయన కనక మంచి ఫోకస్ చేసి సినిమా చేస్తే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి క్రమంలో ఈయన ఎందుకు వేరే వాళ్ళ స్టోరీ మీద డిపెండ్ అయి ఆ సినిమాని చూసి దాంట్లో మార్పులు చేర్పులు చేసి వాటిని తెలుగులో తీస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇక ఇది ఇలా ఉంటే ఈయన రీమేక్ సినిమాలు మాత్రమే చేయగలడు వేరే సినిమాలు చేయలేడు అంటూ మరి కొంతమంది హరీష్ శంకర్ మీద నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజానికి హరీష్ శంకర్ మిరపకాయ్ సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు.
అది తనే రాసుకొని తనే డైరెక్షన్ చేశాడు మరి అలాంటి కథలని కూడా ఇప్పుడు రాసుకొని సక్సెస్ అందుకోవచ్చు కదా అంటూ మరికొంత మంది సినీ మేధావులు సైతం అతన్ని విమర్శించడం గమనార్హం…మరి ఇక మీదట అయిన హరీష్ శంకర్ ఇలాంటి రీమేక్ సినిమాలు అపేసి స్ట్రెయిట్ సినిమాలు చేస్తాడో లేదా చూడాలి…