Hanuman: అయోధ్య పురిలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట చేయడంతో భారతదేశం అంతటా సంతోషం నెలకొంది. హిందువులందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ నామం నలుదిక్కులా వినిపించేలా మారుమోగింది అనడంలో సందేహం లేదు. ఇక ఇదే సమయంలో థియేటర్లలోనూ జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నామస్మరణ కూడా బలంగా వినిపించింది. అందుకు కారణం ఎవరో కాదు హనుమాన్ సినిమా. ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.
తాజాగా ఈ సినిమా హీరో, దర్శకులు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. ఇంతకీ వీరు ఉత్తర ప్రదేశ్ సీఎం ను ఎందుకు కలిశారు అనుకుంటున్నారా? ఇక హనుమాన్ సినిమా హిట్ అవడంతో హీరో, దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించారు యూపీ సీఎం. అయితే యువ ప్రేక్షకులపై ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపించిందో ముఖ్యమంత్రికి వివరించారు దర్శకుడు. అంతేకాదు భారతీయ పురాణ ఇతిహాసాల గొప్పదనాన్ని సినిమాలో ఎలా మిళితం చేసిందో కూడా వివరించారు.
ఇక యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన తర్వాత ప్రశాంత్ వర్మ కొన్ని కామెంట్లు చేశారు. యూపీ సీఎంను కలవడం మాకు లభించిన గౌరవం. నాకు ఇన్ స్పైరింగ్ మూమెంట్ ఇదే. సినిమాల ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలను ఎలా కాపాడుకోవచ్చో సీఎం యోగి వివరించారు. అంతేకాదు మమ్మల్ని అభినందించారు అంటూ తెలిపారు ప్రశాంత్ వర్మ.
ఇక తేజ సజ్జ కూడా మాట్లాడారు. హనుమాన్ సినిమాలో హనుమంతునిగా నటించడం ఒక సవాల్. అదే సమయంలో అటువంటి పాత్ర చేయడం కూడా తనకు లభించిన గొప్ప అదృష్టం అన్నారు. అంతేకాదు సీఎం ను కలవడం గర్వంగా ఉందన్నారు. ఇక ఈ సినిమా కల్చర్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది సీఎం యోగితో చర్చిచాం అన్నారు సజ్జ.