OG’ movie : కొంతమంది సినిమాలు చూడడానికి ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతుంటారు. మరి కొందరి సినిమాలు చూడ్డానికి మాత్రం అమితమైన ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురుచూసే అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారనే చెప్పాలి.
ఒకసారి ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే విజిల్స్ తో గోలలు చేసే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే కోకొల్లలు అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ ఓజీ’ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయింది. ఈ సినిమాని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటి అంటే ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ లీక్ అయింది.
ఆ డైలాగ్ ఎంత పవర్ ఫుల్ గా ఉందంటే అది గనక పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి వచ్చిందంటే థియేటర్లు మొత్తం దద్దరిల్లిపోవడం ఖాయం. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ డైలాగ్ ను చెబుతూ విపరీతమైన రచ్చ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే లీకైన డైలాగును మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ రౌడీలతో ఫైట్ చేసే ముందు ఈ డైలాగ్ రాబోతున్నట్టు గా తెలుస్తుంది. అది ఏంటి అంటే ‘నేను రక్తానికి మరిగిన చీతాని, నా పంజా దెబ్బ తట్టుకుని నిలబడే మగాడు ఎవడైనా ఉన్నాడా ‘ అంటూ అరుస్తూ చెప్పే ఈ డైలాగు వింటుంటేనే మనకు రక్తం మరుగుతుంది.
ఇక థియేటర్ లో పవన్ కళ్యాణ్ చెబితే మాత్రం గుస్ బమ్స్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ డైలాగ్ ను సోషల్ మీడియా మొత్తం వైరల్ చేస్తున్నారు. మరికొందరైతే ఈ డైలాగు చెబుతూ కొన్ని రీల్స్ ని కూడా చేస్తూ వాళ్ల ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమా చూడాలంటే సెప్టెంబర్ 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…