https://oktelugu.com/

Karthikadeepam Premi Vishwanath  : సింపుల్ గా కనిపించే వంటలక్కకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా… స్టార్ హీరోయిన్స్ ఏం సరిపోతారు!

Karthikadeepam Premi Vishwanath : కార్తీకదీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరేమో. క్యారెక్టర్ నేమ్ వంటలక్కగా ఆమె చాలా ఫేమస్. సీరియల్స్ లో కార్తీకదీపం రారాజుగా వెలిగిపోతుంది. టీఆర్పీలో కార్తీకదీపం సీరియల్ ని బీట్ చేసే సీరియల్ మరొకటి లేదు. ఆ సీరియల్ సక్సెస్ లో ప్రేమి విశ్వనాథ్ పాత్ర ఎంతగానో ఉంది. తన సహజ నటనతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో ఎనలేని ప్రేమ సంపాదించారు. ఆ మధ్య కార్తీకదీపం డైరెక్టర్ వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2022 / 10:44 AM IST
    Follow us on

    Karthikadeepam Premi Vishwanath : కార్తీకదీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరేమో. క్యారెక్టర్ నేమ్ వంటలక్కగా ఆమె చాలా ఫేమస్. సీరియల్స్ లో కార్తీకదీపం రారాజుగా వెలిగిపోతుంది. టీఆర్పీలో కార్తీకదీపం సీరియల్ ని బీట్ చేసే సీరియల్ మరొకటి లేదు. ఆ సీరియల్ సక్సెస్ లో ప్రేమి విశ్వనాథ్ పాత్ర ఎంతగానో ఉంది. తన సహజ నటనతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో ఎనలేని ప్రేమ సంపాదించారు. ఆ మధ్య కార్తీకదీపం డైరెక్టర్ వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను చంపేసి ప్రయోగం చేశాడు. అది కాస్తా బెడిసికొట్టింది. కార్తీకదీపం సీరియల్ కి ఆకర్షణ ప్రేమి విశ్వనాథ్ మాత్రమే అని రుజువైంది. దీంతో కథ మార్చేసి వంటలక్కను రంగంలోకి దింపాడు. 
     
    కార్తీకదీపం ఇంత పెద్ద సక్సెస్ అయినప్పటికీ ప్రేమి విశ్వనాథ్ మరొక తెలుగు సీరియల్ లో కనిపించకపోవడం విశేషం. దానికి కారణం ప్రేమి విశ్వనాధ్ ఆషామాషీ నటి కాదు. ఆమెకు నటనే జీవనాధారం కాదు. ఆమెకు కోట్లు విలువ చేసే ఆస్తులు, నెలకు లక్షల సంపాదన ఉంది. వంటలక్కగా చాలా సింపుల్ గా కనిపించే ప్రేమి విశ్వనాథ్ కి ఉన్న ఆస్తుల చిట్టా తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. 
     
    ప్రేమి విశ్వనాథ్ కేరళకు చెందినవారు. ఆమెకు అక్కడ రెండు స్టూడియోలో ఉన్నట్లు సమాచారం. మాలీవుడ్ లో తెరకెక్కే చిత్రాలు, సీరియల్స్ అక్కడ షూటింగ్ జరుపుకుంటాయని సమాచారం. ఇళ్ళు, లగ్జరీ కార్లు అంటూ స్థిర చర ఆస్తుల రూపంలో ఆమె భారీగా కూడబెట్టారట. ఒక అంచనా ప్రకారం ప్రేమి విశ్వనాథ్ ఆస్తుల విలువలు రూ. 40 కోట్లకు పైమాటే అంటున్నారు. ప్రేమి విశ్వనాథ్ భర్త వినీత్ భట్ ప్రముఖ జ్యోతిష్కుడు అట. ఆయన సంపాదన కూడా కోట్లలో ఉంటుందట. 
     
    మలయాళ సీరియల్ నటిగా కెరీర్ మొదలు పెట్టిన ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. అంతకంతకూ ఆమె పాపులారిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. నాగ చైతన్య-వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలో ప్రేమి విశ్వనాథ్ ఎంపికయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. సహజమైన నటన ప్రేమి విశ్వనాథ్ బలమని చెప్పొచ్చు.