Bandi Saroj Kumar: సినిమా సక్సెస్ వెనుక దర్శకుడి యొక్క కష్టం విపరీతంగా ఉంటుంది. వాళ్ళు సినిమా ఎలా తీశారు అనే దానిమీద సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి దర్శకుడు చేసే ప్రతి సినిమాలోని కంటెంట్ ను చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సినిమా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి దర్శకుడు తను చేసే సినిమాల మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు… ఇక ఇలాంటి క్రమంలోనే యూట్యూబ్ లో నిర్బంధం, నిర్బంధం 2, మాంగల్యం, పరాక్రమం లాంటి సినిమాలతో గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ బండి సరోజ్ కుమార్… ఇక ఈయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి చాలా క్లారిటీ ఇచ్చాడు. తను ఇప్పటికి 1000కి పైన సిగరెట్లు తాగే వాడినని ప్రస్తుతానికి మానేశానని చెప్పాడు.
కానీ మోగ్లీ సినిమా కోసం మళ్ళీ సిగరెట్ తాగాల్సి వచ్చిందని చెప్పాడు. అలాగే అమ్మాయిలను కూడా రూమ్ కి తెచ్చుకునే వాడినట్టు ఓపెన్ గా చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక తన ఫ్యామిలీ ని వదిలి ఒంటరిగా ఉండడానికి గల కారణం ఏంటంటే తన ఫోకస్ మొత్తం సినిమా మీద ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్టుగా తెలియజేశాడు.
తనకి చిన్నప్పటి నుంచి రిచ్ లైఫ్ బతకడం అలవాటని రిచ్ పర్సన్స్ అనిపించుకోవడం ఇష్టం ఉండేదని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన తనకి అలాంటి ఐడియాలు ఎలా వచ్చాయో తెలియదని చెప్పాడు. అలాగే ఒకరోజు తన మదర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉమెన్ కావడంతో ఆమె తనను చూడడానికి స్కూల్ కి వచ్చినప్పుడు ఆమె మా పక్కింటవాడని తన తోటి ఫ్రెండ్స్ తో చెప్పేవారట.
మొత్తానికైతే బండి సరోజ్ కుమార్ వైఖరి ఇప్పుడు మొత్తం మారిపోయిందని తను బ్రహ్మచర్యం వహిస్తున్నానని చెప్పాడు. పెళ్ళాం పిల్లలు అనేది ఫేక్ రిలేషన్ షిప్ అని అందులోనే మనం బతుకుతున్నామని అనిపించి భార్యని, కొడుకుని వదిలేశానని చెప్పాడు…ఇక మోగ్లీ మూవీ లో విలన్ పాత్రను పోషిస్తున్న బండి సరోజ్ కుమార్ ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు…