Pawan Kalyan Security : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నాడు.. రాష్ట్రవ్యాప్తంగా ఆయన త్వరలోనే బస్సు యాత్ర ప్రారంభించబోతున్నాడు.. దీనికి సంబంధించిన షెడ్యూల్స్ ని సిద్ధం చెయ్యడంలో జనసేన పార్టీ నాయకులూ బిజీ గా ఉన్నారు.. ఈ యాత్ర కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ‘వారాహి’ అనే పేరుతో ఒక బస్సు ని తయారు చేయించుకున్నాడు.. రెండు రోజుల క్రితమే ఈ బస్సుకి సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చెయ్యగా.. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ ఈ వాహనానికి ఆర్మీ యూనిఫామ్ కలర్ వేయించాడు. రూల్ ప్రకారం ఆ కలర్ ని ఆర్మీ తప్ప ప్రైవేట్ వాహనాలకు ఉపయోగించరాదని.. అది చట్టరీత్యా నేరం అంటూ వైసీపీ పార్టీ నాయకులూ తెగ గోల చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ట్విట్టర్ లో తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చాడు.
ఇక పవన్ కళ్యాణ్ మొన్న పెట్టిన వీడియోలో ‘వారాహి’ వామనం చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ పటిష్టంగా ఉండడం మనం గమనించొచ్చు.. అయితే వీళ్ళందరూ పంజాబ్ మరియు హర్యానాలో ఉండే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ అని సమాచారం.. పవన్ కళ్యాణ్ కోసం స్వచ్ఛందంగా సెక్యూరిటీ ఉంటామని వచ్చారని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్.. ఈ సినిమా తర్వాత వెంటనే బస్సు యాత్ర చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది.. మార్చి మొదటివారం నుండి ఈ పర్యటన ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ హవా గట్టిగానే కనిపిస్తోంది.. ఇతర పార్టీల నుండి నాయకులు జనసేన పార్టీలో ఈ బస్సు యాత్ర సమయంలోనే చేరడానికి రంగం సిద్ధమైందట.. జనసేన పార్టీ దశ దిశా మొత్తం ఈ యాత్ర తో తిరిగిపోనుంది అని జనసేన పార్టీ నాయకులు నమ్మకంతో చెప్తున్నారు. ఈ బస్సు యాత్ర పవన్ కళ్యాణ్ ని విజయతీరాలకు చేరుస్తుందా లేదా అనేది చూడాలి..