Andhra King Taluka Collection: మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ ఆదరించడం లో ఎప్పుడూ విఫలం అవ్వలేదు. కానీ కొన్ని సందర్భాల్లో హృదయానికి హత్తుకునే కొన్ని ఎమోషనల్ సినిమాలను సక్సెస్ చేయడం లో ఆడియన్స్ విఫలం అయ్యారు. రీసెంట్ గా విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Movie) చిత్రం అందుకు ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. వరుస ఫ్లాప్ సినిమాలను అందుకుంటూ వస్తున్న రామ్(Ram Pothineni), తన తప్పులను సరిదిద్దుకుంటూ, ఆడియన్స్ కి ఎలాంటి సినిమా అందించాలో అర్థం చేసుకొని, చాలా కష్టపడి మనసుపెట్టి చేసిన సినిమా ఇది. ఇందులో కేవలం నటించడమే కాదు, పాటలకు లిరిక్స్ కూడా అందించాడు. ‘నువ్వెంటే చాలే’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ ప్రతీ ఒక్కరి ప్లే లిస్ట్ లో ఈ పాట కచ్చితంగా ఉంటుంది . అంత పెద్ద హిట్ అయింది. ఇలా హీరో అన్ని క్రాఫ్ట్స్ లో మనసు పెట్టి పనిచేసిన సినిమా ఇది.
అలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ని చూసిన అనుభూతి కలిగింది అంటూ చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. పోనిలే రామ్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి కమర్షియల్ హిట్ పడింది అని అందరూ సంతోషించారు. కానీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకొని, లాభాల్లోకి అడుగుపెట్టి, సూపర్ హిట్ స్టేటస్ ని అందుకోవడం దాదాపుగా అసాధ్యమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. థియేటర్స్ లో పది రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విడుదలకు ముందు 28 కోట్ల రూపాయలకు జరిగిందట. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా మరో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. నిన్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. నేడు ఆదివారం కాబట్టి మరో 50 లక్షల షేర్ వస్తుందని అనుకోవచ్చు. ఈ నెల 12 వరకు కొత్త సినిమాలు విడుదల లేవు కాబట్టి, ఈ చిత్రం థియేట్రికల్ రన్ క్లోజింగ్ లో 20 కోట్ల రూపాయిల వరకు చేరొచ్చు. కానీ అంతకు మించి వసూళ్లు రావడం అనితరసాధ్యమైన విషయం. ఏ యాంగిల్ లో చూసినా నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. పాపం రామ్ కి ఈసారి బ్యాడ్ లక్ అనే చెప్పాలి.