https://oktelugu.com/

Akhil Agent : డైరెక్టుగా ఓటీటీలో విడుదల కానున్న ‘ఏజెంట్’..అక్కినేని ఫ్యాన్స్ కి ఇది కోలుకోలేని షాక్

Akhil Agent : ఇండస్ట్రీ కి వచ్చి 8 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ సరైన సక్సెస్ లేకుండా ఇబ్బంది పడుతున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది అక్కినేని అఖిల్ అని చెప్పొచ్చు.అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫ్యూచర్ మహేష్ బాబు అనే రేంజ్ భారీ హైప్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా మినహా మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఆశలన్నీ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 3, 2023 / 08:18 PM IST
    Follow us on

    Akhil Agent : ఇండస్ట్రీ కి వచ్చి 8 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ సరైన సక్సెస్ లేకుండా ఇబ్బంది పడుతున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది అక్కినేని అఖిల్ అని చెప్పొచ్చు.అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫ్యూచర్ మహేష్ బాబు అనే రేంజ్ భారీ హైప్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా మినహా మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఆశలన్నీ కూడా ‘ఏజెంట్’ సినిమా మీదనే ఉన్నాయి.

    సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా అఖిల్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని,ఆయనని టాప్ హీరోల లీగ్ లోకి తీసుకెళ్తుందని నమ్మకం తో ఉన్నారు.ఈ నెల 28 వ తారీఖున గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు కూడా చేసారు.

    ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ మరియు పాటలకు ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.మలయాళం సూపర్ స్టార్ మమ్మూటీ ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించాడు.ఇలా ఎన్నో ప్రత్యేకతలు నడుమ ఈ చిత్రం తెరకెక్కింది.అయితే ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ చిత్ర డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు నిర్మాత సుంకర రామబ్రహ్మం మధ్య తరచూ విబేధాలు ఏర్పడుతున్నాయట.ఎట్టి పరిస్థితి లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28 వ తారీఖున థియేటర్స్ లో విడుదల చెయ్యాలనే ఉద్దేశ్యం తో నిర్మాత ఉన్నాడట,కానీ సురేందర్ రెడ్డి మాత్రం ఇంకా కాస్త సమయం కావాలని అడుగున్నాడట.

    ఇక్కడే వీళ్లిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయని టాక్.దీనితో ఈ సినిమా ఈ నెల 28 వ తారీఖున విడుదల కావడం కష్టమే అని తెలుస్తుంది.ఇంకోసారి వాయిదా పడితే నేరుగా ఓటీటీ కి ఇచ్చేస్తానని నిర్మాత సుంకర రామబ్రహ్మం సురేందర్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చాడట.ఇది ఇపుడు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.