Geethu Mohandas Toxic movie: వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో తెలుగు ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘టాక్సిక్'(Toxic Movie). KGF సిరీస్ తర్వాత హీరో యాష్ నుండి విడుదల అవ్వబోతున్న సినిమా కావడం , ఆనికి తోడు మొదటి టీజర్ కి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి మాత్రం ఆడియన్స్ నుండి పెద్దగా రెస్పాన్స్ రాలేదు . సినిమాలో వయొలెన్స్ తప్ప , ఇసుమంత ఓషన్ కూడా లేదని తెలుస్తోంది , ఇలా ఉంటే సినిమా ఆడడం చాలా కష్టం. పైగా ఈమధ్య కాలంలో ఇలాంటి వయొలెన్స్ సినిమాల్లో చాలా సాధారణం అయిపోవడంతో యూత్ ఆడియన్స్ లో కూడా ఇలాంటి సినిమాలకు నెమ్మదిగా క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది.
వయొలెన్స్ తో పాటు , సినిమాలో కంటెంట్, ఎమోషన్ కచ్చితంగా ఉండాల్సిందే , లేదంటే డిజాస్టర్ ఫలితం తప్పదు. అందుకు లేటెస్ట్ ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం లో ఇంత రక్తపాతాన్ని సృష్టించిన డైరెక్టర్ ఒక మహిళ. ఆమె పేరు గీతూ మోహన్ దాస్. ఒక మహిళ లో ఇంతటి హింసాత్మక ఆలోచనలు ఉంటాయా? , సందీప్ వంగ , ప్రశాంత్ నీల్ లాంటోళ్లకు కూడా ఇంతటి వైల్డ్ ఆలోచనలు రాలేదు కదా , ఈమెకు ఎలా సాధ్యం అయ్యింది ?, ఎక్కడో తేడా కొడుతోంది శీనా.. అని చాలా మంది సోషల్ మీడియాలో అనుమానపడ్డారు. వాళ్ళ అనుమానమే నిజం అయ్యింది. ఈ చిత్రం లో అనేక యాక్షన్ సన్నివేశాలు హీరో యాష్ కి నచ్చలేదట. దీంతో ఆ యాక్షన్ సన్నివేశాలను రీ షూట్ చెయ్యాలని నిర్మాత పై ఒత్తిడి తీసుకొచ్చాడు . కేవలం రీ షూట్ కోసం పాతిక కోట్ల రూపాయిలు ఖర్చు చేయించాడట యాష్.
అయితే ఈ రీ షూట్ కి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించలేదు. యాష్ దర్శకత్వం లో లాగించేశారట. అందుకే ఆ సన్నివేశాలు అంత వయొలెంట్ గా ఉన్నాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేస్తున్నారు. మరి ఏ సన్నివేశాలకు తగ్గట్టుగా సినిమాలో ఒక మంచి ఎమోషనల్ పాయింట్ ఉంటుందా లేదా అనేది తెలియాలంటే వచ్చే నెల 19 వరకు ఆగాల్సిందే . ఈ సినిమాతో పాటు ‘ధురంధర్ 2’ కూడా విడుదల అవుతుందని అంతా అంటున్నారు . దీనికి సంబంధించి మరోసారి అధికారిక ప్రకటన మరోసారి మేకర్స్ నుండి వస్తే కానీ నమ్మేలా లేరు జనాలు.