Site icon OkTelugu

Gaayapadda Simham 1st Day Collections: ‘గాయపడ్డ సింహం’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ కా బాప్ అయ్యేలా ఉందే..

Gaayapadda Simham 1st Day Collections

Gaayapadda Simham 1st Day Collections

Gaayapadda Simham 1st Day Collections: విభిన్నమైన యూత్ ఫుల్ మూవీస్ తో యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న దర్శకులలో ఒకరు తరుణ్ భాస్కర్. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా ఎంతో ప్రత్యేకం. కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా, నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే ఈమధ్య కాలంలో ఆయన హీరో గా కూడా మారాడు. మొదటి సినిమా అంతగా ఆడలేదు కానీ , రెండవ చిత్రం ‘గాయపడ్డ సింహం'(Gayapadda Simham) మాత్రం మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎందుకంటే థియేట్రికల్ ట్రైలర్ బాగా పేలడం, ఈ తరం లో సూపర్ హిట్ చిత్రాలుగా నిల్చిన వాటిల్లో కొన్ని సన్నివేశలను స్పూఫ్ చేయడం, జేడీ చక్రవర్తి రీ ఎంట్రీ ఇవ్వడం, ఇలాంటి అంశాలన్నీ ఈ చిత్రం పై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది.

సినిమాకు కూడా యావరేజ్ రేంజ్ లో టాక్ వచ్చింది కానీ , ఓపెనింగ్స్ మాత్రం రాలేదు. ఈ చిత్రం పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని సంపాదించి, హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే కచ్చితంగా 8 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను రాబట్టాలి. కానీ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ ని చూస్తుంటే, ఫుల్ రన్ లో కనీసం 50 శాతం కూడా రీకవరీ అయ్యేలా కనిపించడం లేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి రోజున కేవలం 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంటే గ్రాస్ వసూళ్లు దాదాపుగా 1 కోటి 23 లక్షల రూపాయిల వరకు ఉండొచ్చు అన్నమాట. ప్రాంతాల వారిగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఆంధ్ర ప్రదేశ్ నుండి 37 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రయికి 82 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు , 40 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 6 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఓవర్సీస్ నుండి 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 1 కోటి 23 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రం ఇంకా 7 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి, అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు.

Exit mobile version