Sankranti Movies 2023: సంక్రాంతి అంటేనే దక్షిణాదిలో పెద్ద పండుగ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం అని సంబంధం లేకుండా భారీగా సినిమాలు విడుదలవుతాయి. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. కోవిడ్ వల్ల గత రెండేళ్లుగా ఆశించినంత సందడి కనిపించలేదు. కానీ ఈసారి సంక్రాంతి కి సాలిడ్ సినిమాలు వస్తున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నటసింహ బాలకృష్ణ వీరసింహారెడ్డి, దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు ఇప్పటికే తమ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. వీటికి థియేటర్లు సర్దుబాటు కావాలనే ఉద్దేశంతో అఖిల్ ఏజెంట్ రేసు నుంచి తప్పుకుంది. పోటీ ముక్కోణం గా ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా తమిళ అజిత్ తెరపైకి వచ్చారు. తనివు డబ్ వెర్షన్ తెగింపుతో సంక్రాంతి బరిలోకి వచ్చేశారు.

పోటాపోటీగా
తీవ్రమైన పోటీ మధ్య వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా వారసుడు సినిమాని దిల్ రాజు భారీ ఎత్తున ప్లాన్ చేసే విడుదల చేస్తున్నారు. దీని మీద ఎంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ తెరవెనుక వ్యవహారాలు చురుగ్గా సాగిపోతున్నాయి. ప్రమోషన్ల కార్యక్రమంలో చిరంజీవి, బాలయ్య వెనుకబడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రెండు సినిమాల షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో మైత్రి బృందం ఆ ఒత్తిడిలో పడి పబ్లిసిటీ వేగం పెంచలేదు. వారసుడికి సంబంధించి రెండు లిరికల్ వీడియోస్ వచ్చేసాయి. యూ ట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.
మధ్యలో అజిత్ వచ్చాడు
పోటీ ముక్కోణంగా ఉన్న నేపథ్యంలో తమిళ హీరో అజిత్ తెరపైకి వచ్చాడు. ఈసారి తన డబ్బింగ్ సినిమా తెగింపుతో బరిలో నిలిచాడు. మొన్నటిదాకా తెలుగు డబ్బింగ్ వర్షన్ సమాంతర విడుదల ఉంటుందా లేదా అనే అనుమానాలు ఉండేవి.. వాటికి చెక్ పెడుతూ థియేటర్ రైట్స్ ఇచ్చేశారు. తెగింపు టైటిల్ తో తునివు ను తెలుగులోకి డబ్ చేస్తున్నారు. కేవలం మూడు కోట్లకు డీల్ పూర్తయిందని వినికిడి.. ఒకవేళ టాక్ కనుక పాజిటివ్ వస్తే ఈ మొత్తం చాలా ఈజీగా రికవరీ అవుతుంది.. ఇంత తక్కువ మొత్తానికి ఫిక్స్ చేయడం వెనుక ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్లు దొరకకపోవడమే కారణం.. తెలుగు నాట అజిత్ కు తక్కువ మార్కెట్ ఉంది. గ్యాంబ్లర్ తర్వాత అతడి గత చిత్రాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. అందుకే మూడు కోట్లకే క్లోజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి తమిళ వర్షన్ నుంచే నిర్మాతకు భారీగా లాభాలు వచ్చాయి.. సో బోనికపూర్ ఇతర భాషల గురించి ఆలోచించడం లేదు. బ్యాంకు రాబరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని ఒక టాక్. ఇందులో అజిత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.. ఇందులో హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. మంజు వారియర్ కు యాక్షన్ టచ్ ఉన్న పాత్ర లభించింది. పాటలు కూడా ఒకటి రెండు మాత్రమే ఉంటాయని వినికిడి.

సర్దుబాటు అయ్యాయా
చిరంజీవి వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి.. ఈ రెండు సినిమాలు నిర్మించింది మైత్రి మూవీస్. అంతకుముందు బాలకృష్ణ నటించిన అఖండ బ్లాక్ బస్టర్ కావడం, చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సూపర్ హిట్ కావడంతో వీరి నుంచి వస్తున్న తాజా సినిమాలపై బజ్ ఏర్పడింది. ఇద్దరు కూడా కల్ట్ మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు కావడంతో థియేటర్ల సర్దుబాటు ఇబ్బందికరంగా మారింది.. మరో వైపు దిల్ రాజు తన వారసుడు సినిమాని భారీ ఎత్తున విడుదల చేస్తున్న నేపథ్యంలో ఉన్న థియేటర్లనే చిరంజీవి, బాలకృష్ణ పంచుకోవాల్సి వస్తున్నది. అయితే ఈ రెండు సినిమాలకి నిర్మాతలు ఒకరే కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలకి మెజారిటీ థియేటర్లు, వారసుడికి కొంచెం తక్కువ థియేటర్లు ఇవ్వాలనే ప్రపోజల్ నడిచినట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు మూడు చిత్రాలు లైన్లో ఉండగా.. ఇప్పుడు వాటికి అజిత్ కూడా తోడవడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.