Sreemukhi: బుల్లి తెర మీద యాంకర్ గా చాలా బాగా పాపులర్ అయిన వాళ్లలో శ్రీ ముఖి ఒకరు. ఈమె మొదట్లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు క్యారెక్టర్ లో నటించి నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈ సినిమా హిట్ అవ్వడం తో రామ్ హీరో గా వచ్చిన నేను శైలేజా అనే సినిమాలో కూడా రామ్ చెల్లేలుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇవన్నీ ఇచ్చిన గుర్తింపు కంటే కూడా ఆమె కి మంచి గుర్తింపుని ఇచ్చింది ఏంటి అంటే అది మల్లె మాల వాళ్ళు నిర్వహించే పటాస్ షో అనే చెప్పాలి.
ఈ షో లో శ్రీముఖి యాంకర్ రవి తో కలిసి ఆమె మాట్లాడే మాటలు, చేసే కామెడీ, వేసే వేషాలు అన్ని కూడా అప్పట్లో ఆ షో చూసిన చాలామంది కి విపరీతం గా నచ్చాయి.దాంతో ఆమె బుల్లి తెర మీద టాప్ యాంకర్ గా కొనసాగింది ఇక ఇప్పటికీ కూడా ఫిమేల్ యాంకర్స్ లలో సుమ తర్వాత అంతటి గొప్ప క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ కూడా ఆమె కావడం నిజంగా విశేషం అనే చెప్పాలి.. ఏ సినిమా ఫంక్షన్ జరిగిన ఆమె వ్యాఖ్యాత గా వ్యవహరిస్తూ ఉంటుంది.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కానీ బిగ్ బాస్ షో కి వచ్చిన తర్వాత మాత్రం ఆమె క్రేజ్ తార స్థాయి కి చేరుకుందని తెలుస్తుంది…ఇక ఈమె చాలా రోజుల నుంచి ఒక విషయం లో వార్తల్లో నిలుస్తూ వస్తుంది అదేంటంటే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుంది వరుడు ఎవరో తెలుసా అంటూ చాలా రోజుల నుంచి ఆమె పెళ్లి మీద విపరీతమైన న్యూస్ లు వస్తున్నాయి. కానీ ఆమె ఎప్పుడు స్పందించలేదు.కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆమె ఎవరిని అయితే ఇన్ని రోజుల నుంచి లవ్ చేస్తూ వస్తుందో అతన్నే పెళ్లి చేసుకోబోతున్నట్టు గా తెలుస్తుంది…
ఇప్పటి వీళ్ల ప్రేమ విషయం వాళ్ల ఇంట్లో కూడా చెప్పడంతో శ్రీముఖి వాళ్ల నాన్న వీళ్ళ పెళ్లి కి ఒప్పుకున్నట్లు గా తెలుస్తుంది. దాంతో తొందర్లోనే ఆమె పెళ్లి విషయమని అఫిషియల్ గా అభిమానులకి తెలిజేస్తుంది అనే విషయం కూడా తెలుస్తుంది…అయితే ఇన్ని రోజుల నుంచి తన సినీ కెరియర్ కోసమే ప్రేమ వ్యవహారాన్ని బయటికి రానివ్వకుండ జాగ్రత్త పడినట్లు గా తెలుస్తుంది….