Site icon OkTelugu

Sukumar: సుకుమార్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

Do you know who is Sukumar favorite hero

Do you know who is Sukumar favorite hero

Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దర్శకుడు సుకుమార్.. ఇక తనదైన రీతిలో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆర్య సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సినిమాలు చేసుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేశాడు. అయితే తను ఇండస్ట్రీకి రావాలి అనుకున్న సమయంలో ఆయనకి చాలామంది హీరోలు, దర్శకులు ఇన్స్పిరేషన్ గా నిలిచారట. నిజానికి చిరంజీవి అంటే సుకుమార్ కి చాలా ఇష్టమట… చిన్నప్పటినుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరగడం వల్ల చిరంజీవి సినిమాలు అంటేనే ఆయనకు విపరీతమైన ఇష్టంతో పాటు ఎప్పటికైనా సరే చిరంజీవి తో సినిమా చేయాలి అనే ఉద్దేశ్యంతోనే తను సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట. అయినప్పటికీ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఆయనకి ఇప్పటివరకు రాలేదు.

కానీ రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా తీసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి ఫ్యూచర్ లో చిరంజీవి తో సినిమా చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం పుష్ప 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సుకుమార్ ఇండస్ట్రీకి రాకముందు స్కూల్ టీచర్ గా పని చేశాడు. అందులో భాగంగానే ఆయన మ్యాథ్స్ టీచర్ గా చేసి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండటంతో అది మానేసి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు…

ఇక మొదట్లో వి వి వినాయక్ దగ్గర దిల్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లోనే ఆర్య సినిమాని తెరకెక్కించి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక మొత్తానికైతే ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని టాప్ 5 డైరెక్టర్లలో తను ఒక్కడిగా ఎదిగాడు…

Exit mobile version