Venkatesh Wife: మన టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..దిగ్గజ నిర్మాత స్వర్గీయ శ్రీ రామానాయుడు గారి కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వెంకటేష్ కి స్టార్ హీరో గా ఎదగడానికి పెద్దగా సమయం పెట్టలేదు..యాక్షన్ హీరో గా..కుటుంబ కథల హీరో గా వెంకటేష్ కి ఉన్న ఇమేజి మామూలుది కాదు..ముఖ్యంగా సెంటిమెంట్ పండించడం లోను..అలాగే కామెడీ టైమింగ్ లోను వెంకటేష్ ని మించిన హీరో మరొకరు లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఆరుపదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికి బాక్స్ ఆఫీస్ వద్ద కుర్ర హీరోలతో సమానంగా తన సత్తాని చాటుతూ ముందుకి దూసుకుపోతున్నాడు వెంకటేష్..ఇటీవలే ఆయన హీరోగా నటించిన F3 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..ఇది పక్కన పెడితే వెంకటేష్ వ్యక్తిగత విషయాల గురించి చాలా తక్కువ మాత్రమే మనకి తెలుసు..తన కుటుంబ సబ్యులకు సంబందించి వారిని మీడియా ముందుకి తీసుకొని రావడం వెంకటేష్ పెద్దగా ఇష్టం ఉండదు..ఇనాళ్ళు ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ కూడా వెంకటేష్ ఏ రోజు కూడా తన భార్య ని మనకి చూపలేదు..అంతతి ప్రైవేట్ జీవితాన్ని కోరుకుంటాడాయన.

వెంకటేష్ గారి తండ్రి రామానాయుడు గారు ప్రముఖ దర్శకుడు నాగిరెడ్డి గారి సలహా మేరకు ఆయనకీ దగ్గర బంధువైన మదనపల్లి కి చెందిన సుబ్బా రెడ్డి గారి కూతురు నీరజ రెడ్డి ని ఇచ్చి పెళ్లి చేసాడు..1985 వ సంవత్సరం లో చెన్నై లోని విజయ శేషమహల్ లో వీళ్లిద్దరి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు..ఈ జంటకి ఇద్దరు కూతుర్లు ఒక్క కొడుకు ఉన్నాడు..కూతుర్లు ఇద్దరు కూడా సోషల్ మీడియా లో ఉండగా..వెంకటేష్ గారి సతీమణి నీరజ రెడ్డి గారు మాత్రం మీడియా కి దూరంగా ఉంటూ వస్తున్నారు..దీనికి కారణం ఏమిటి అంటే నీరజ గారికి మీడియా లో వచ్చే రూమర్స్ అన్నా..కామెంట్స్ అన్నా చాలా చిరాకు అట..తన గురించి ఒక్కరు మాట్లాడుకోవడానికి అసలు ఇష్టపడదట నీరజ గారు..అందుకే మీడియా కి ఆమె ఎప్పుడు దూరంగా ఉంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త..ఇన్నేళ్ల వెంకటేష్ సినీ కెరీర్ లో ఒక్క రూమర్ కూడా రాలేదు..అయినా కూడా తనకి సంబంధించిన వారిని మీడియా ముందుకి తీసుకొచ్చేందుకు వెంకటేష్ పెద్దగా ఆసక్తి చూపించడు..ఇక వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరో గా నటిస్తున్న ‘కభీ ఈద్ కభీ దీవాలి’ అనే సినిమాలో వెంకటేష్ ఒక్క కీలక పాత్ర పోషిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది.
Also Read: Dethadi Harika: దేత్తడి హారిక హాట్ షో.. అసలు అది డ్రెస్సేనా.. మరీ అంతగా
[…] Also Read: Venkatesh Wife: వెంకటేష్ తన భార్య ని మీడియా కి చ… […]