Site icon OkTelugu

Balakrishna-Mohan Babu: ఆ సినిమా కోసం మోహన్ బాబు ఆఫర్ చేసిన క్యారెక్టర్ ను బాలయ్య రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా..?

why Balayya rejected the character offered by Mohan Babu

Balakrishna-Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మంచి నటనలలో మోహన్ బాబు ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ, ఒక సపరేట్ మ్యానరిజంతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరునైతే సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు లాంటి సినిమాలు ఆయన కెరియర్లో మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ఇదిలా ఉంటే రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో ఆయన చేసిన అధిపతి సినిమాలో యువ సామ్రాట్ నాగార్జున గెస్ట్ పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే మొదటగా ఈ సినిమాలో నాగార్జున పోషించిన పాత్ర కోసం మోహన్ బాబు నందమూరి నటసింహమైన బాలయ్య బాబుని అడిగాడట. బాలయ్య బాబు అప్పుడు వరుసగా నాలుగు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనలేకపోయాడు. దాంతో అప్పటికే నాగేశ్వరరావు మోహన్ బాబు కి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంది.

అలాగే మోహన్ బాబు కి నాగార్జున కి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది.ఇక ఆ ఫ్రెండ్షిప్ వల్లే నాగార్జున హీరోగా చేసిన అన్నమయ్య సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో మోహన్ బాబు నటించాడు. ఇక మోహన్ బాబు కూడా తన అధిపతి సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం నాగార్జునని అడగగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మొత్తానికైతే నాగార్జున ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించి సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాడు.

అయినప్పటికీ ఈ సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా మోహన్ బాబు కి నాగార్జున అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. ఎందుకంటే తన మాట మీద గౌరవంతో నాగార్జున ఆ పాత్రను పోషించినందుకు ఆయన్ని మోహన్ బాబు ఇప్పటికీ ఇష్టపడుతూనే ఉంటాడు…

Exit mobile version