Adireddy: బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి ఒక్క నెల ఆదాయం ఎన్ని లక్షలో తెలుసా..? లెక్కలతో సహా చెప్పేశాడు!

ఆదిరెడ్డి పెయిడ్ రివ్యూవర్ అంటూ వస్తున్న కామెంట్స్ పై స్పందిస్తూ .. అవును నేను పెయిడ్ రివ్యూవర్ నే అంటూ పోస్ట్ పెట్టాడు. తనకి ఎంత ఆదాయం వచ్చిందో చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసాడు.

Written By: NARESH, Updated On : November 15, 2023 9:22 am

Adireddy

Follow us on

Adireddy: బిగ్ బాస్ రివ్యూలు చెప్పి ఫేమస్ అయ్యాడు ఆదిరెడ్డి. ఆయన గత సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లి ఫైనలిస్ట్ గా నిలిచారు. అయితే ఆదిరెడ్డి రివ్యూస్ జెన్యూన్ గా ఉండడంతో .. ఫాలోవర్స్ క్రమంగా పెరుగుతూ వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలోఆదిరెడ్డి ఫేక్ రివ్యూవర్ అనే ముద్ర పడింది. దాంతోపాటు ఆది రెడ్డి డబ్బులు తీసుకుని రివ్యూలు చెప్తుంటారని .. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు డీల్ కుదుర్చుకుంటారనే ప్రచారం ఉంది.

అయితే ఆదిరెడ్డి పెయిడ్ రివ్యూవర్ అంటూ వస్తున్న కామెంట్స్ పై స్పందిస్తూ .. అవును నేను పెయిడ్ రివ్యూవర్ నే అంటూ పోస్ట్ పెట్టాడు. తనకి ఎంత ఆదాయం వచ్చిందో చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసాడు. ‘ నా ఫాలోవర్స్ నన్ను ఆదరించడం వల్ల .. వాళ్ళు పెట్టిన బిక్ష నాకు ఈ నెల 39 లక్షలు వచ్చింది. నన్ను చాలా మంది పెయిడ్ రివ్యూవర్ అంటున్నారు. నన్ను ట్రోల్ చేస్తున్నారు.

నన్ను ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా .. బిగ్ బాస్ రివ్యూలు చెప్పే ఏ రివ్యూవర్ పెయిడ్ కాదు.బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. అలాంటిది మేమేం చేస్తాం. ఒక రివ్యూవర్ కి డబ్బులిస్తే .. వాడు రోజు పాజిటివ్ గా ఎలా చెప్తాడు. అది సాధ్యమే కాదు. అందుకే చెప్తున్నా .. నేనైతే పెయిడ్ రివ్యూవర్ ని నాకు యూట్యూబ్ మాత్రమే పే చేస్తుంది. నా ఛానల్ ను చూసేవాళ్ళు పే చేస్తున్నారు.

ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే .. అసలు ఎవడో నాకు ఎవడో డబ్బులు ఇవ్వడం ఏంటి . నాకు గత నెల యూట్యూబ్ ద్వారా ఆదాయం 39 లక్షలు వచ్చింది. నా వీడియోస్ దాదాపు లక్ష మంది అమెరికా నుంచి చూస్తున్నారు. నేను ఇక్కడ నిలబడి 39 లక్షలు సంపాదించానంటే .. ఈజీగా వచ్చేయలేదు. దాదాపు 17-18 గంటలు బిగ్ బాస్ చూస్తున్నాను. ప్రతి దాన్ని రాసుకుని రివ్యూస్ చెబుతున్నాను కాబట్టి సక్సెస్ వచ్చింది అని చెప్పుకొచ్చాడు అది రెడ్డి. కాగా ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఫైనల్ కి వెళ్లిన ఆదిరెడ్డి 4వ స్థానంలో నిలిచాడు.