Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సాధించిన విజయాలే ఆయనను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాయి. ఇక ఆయనను అధిరోహించాలనే సాహసం చేయడం కూడా మూర్ఖత్వం అవుతుందనే చెప్పాలి. ఇక ఆయన ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా 40 సంవత్సరాల పాటు కొనసాగుతున్నాడు. ఇక తన తర్వాత ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగే యంగ్ స్టార్ హీరో ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి చేసిన సినిమాలతోనే కాకుండా ఆయన వదిలేసిన సినిమాలను చేసిన హీరోలు కూడా స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. ఇక అందులో భాగంగానే చిరంజీవి చేయాల్సిన అల్లుడుగారు సినిమాని మోహన్ బాబు రీమేక్ చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. అయితే మొదట ఈ సినిమాను రాఘవేందర్రావు చిరంజీవితో చేయాలి అనుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల అది మోహన్ బాబు చేశాడు. దానివల్లే మోహన్ బాబు అంతకు ముందు ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ ఆ ఒక్క సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకొని మరోసారి తను ఫామ్ లోకి వచ్చాడు. నిజానికి ఈ సినిమా మలయాళం లో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘చిత్రం ‘ సినిమాకి రీమేక్ తెరకెక్కింది.
అయితే మొదట రాఘవేంద్రరావు వేరే ప్రొడ్యూసర్ తో ఈ సినిమా రైట్స్ ని తీసుకోమని చిరంజీవితో చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ కథని తెలుసుకుని చిరంజీవి ఆ సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో ఆయన ఆ కథని రిజెక్ట్ చేశాడు. ఇక అప్పుడు మోహన్ బాబు ఆ రీమేక్ రైట్స్ ను తీసుకొని తన లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పైన రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమాని చేశారు.
ఇక మొత్తానికైతే చిరంజీవి ఈ సినిమాను రిజెక్ట్ చేయడం మోహన్ బాబు కి కలిసి వచ్చిందనే చెప్పాలి…ఇక అప్పటి నుంచి మోహన్ బాబు మళ్ళీ వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరో గా కొనసాగాడు…