Pokiri Actress Jyoti Rana : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ వరుస సినిమాలు చేసి సక్సెస్ లు కొట్టడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు మొన్నటి వరకు ఆయన తీసిన సినిమాలు ఇండస్ట్రీలో ఒక పెను సంచలనంగా మారేవి ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరికీ తను మంచి సక్సెస్ ని ఇచ్చి మార్కెట్ లోకి వదిలాడు. పూరి జగన్నాథ్ అంటే సినిమాలని చాలా తొందరగా తీసి హిట్ కొట్టే డైరెక్టర్ గా ఇండస్ట్రీలో చాలా గొప్ప పేరును సంపాదించుకున్నాడు.
అయితే 2006 వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ చేసిన పోకిరి సినిమా అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది దాంతో మహేష్ బాబు కి ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోగా కూడా పేరు సంపాదించుకున్నాడు నిజానికి పూరి జగన్నాథ్ అంటే తక్కువ టైం లో సినిమాలను చేస్తూ సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి అయితే పోకిరి సినిమాలో విలన్ గ్యాంగ్ లో చాలా యాక్టివ్ గా ఉండే ఒక లేడీ పాత్రలో ఒక అమ్మాయి మెరిసింది ఆమె జ్యోతి రానా…ముఖ్యంగా విలన్ ప్రకాష్ రాజ్ కి వేరే వాళ్ళతో డీల్ మాట్లాడినప్పుడు ప్రకాష్ రాజ్ పక్కన ఈమె కూర్చొని ఉంటుంది.అప్పుడు ప్రకాష్ రాజ్ ఆమెని గిల్లుతాడు. ఆ సమయంలో ఆమె అరుస్తుంది. దాంతో ప్రకాష్ రాజ్ కోపం గా గిల్లితే గిల్లిచ్చుకోవాలి కానీ అరవకూడదు అనే డైలాగ్ చెప్తాడు.
ఆ సీన్ లో జ్యోతి రానా నటించింది. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత కూడా ఆమెకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె ఏ సినిమాలో నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. స్వతహాగా ఆమె ముంబైలో పుట్టి పెరిగిన యువతీ కావడం వల్ల సినిమాల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండడంతో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఆమె సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ఒక మంచి యోగా టీచర్ గా తన కెరియర్ ని సాగిస్తుంది.
ఇక ఇప్పుడు సర్టిఫైడ్ యోగ ఇన్ స్టక్చర్ గా కూడా రాణిస్తోంది. అయితే జ్యోతి రానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండడంతో ఆమె గురించి తెలుసుకోవాలని యూత్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో వాళ్లు అనే గురించి సోషల్ మీడియాలో విపరీతంగా సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే జ్యోతి రానా తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…