సినిమా రంగం లో విజయానికి మాత్రమే గుర్తింపు ఉంటుంది. టాలెంట్ ఉన్నా అపజయం వరించిన వ్యక్తులకు అంత తేలికగా అవకాశాలు రావు. అలాంటి చోట దర్శకుడు తేజ రెండు సినిమా అవకాశాలు దక్కించు కొన్నాడు. కాగా ఆరెండు చిత్రాలు ఎస్టాబ్లిష్డ్ హీరోలతో కావడం విశేషం.
దర్శకుడు తేజ చివర సారిగా నిర్మించిన సీత చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. కాజల్,బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా నటించిన ఈ చిత్రం గురితప్పి ప్రేక్షక సహనానికి పరీక్షగా నిలిచింది. ఆ అనుభవంతో తేజ ఇపుడు రెండు విభిన్న కధల్ని సిద్ధం చేసాడు, అందులో ఒకటి పొలిటికల్ డ్రామా కాగా , రెండోది ఫామిలీ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది.
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రానికి రాక్షసరాజ్యంలో రావణాసురుడు అని టైటిల్ ఫిక్స్ చేయడం జరిగింది. గతంలో నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తేజ దర్శకత్వంలో మంచి విజయాన్ని అందుకొన్న దగ్గుబాటి రానా ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలోఉన్న రాజకీయ వ్యవస్థ కి అడ్డం పట్టేలా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది.
ఇక తేజ దర్శకత్వంలో రాబోయే రెండో చిత్రానికి అలిమేలు మంగ వెంకట రమణ అని పేరు పెడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో తేజ నిర్మించిన ఫామిలీ సర్కస్ సినిమా తరహాలో ఇదొక హాస్య కుటుంబ కదా చిత్రమని తెలుస్తోంది. ముందు ఈ చిత్రంలో హీరోయిన్ గా నేనే రాజు నేనే మంత్రి ఫేమ్ కాజల్ నే హీరోయిన్ గా అనుకొన్నారు. కానీ ప్రస్తుతం కాజల్ స్తానం లో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ వచ్చి చేరింది. ఇక ఈ సినిమాలో హీరోగా గోపీచంద్ నటిస్తాడని రూఢీగా తెలుస్తోంది.
Failures are stepping stones