Dil Raju Allu Arjun Movie : భారీ బడ్జెట్ సినిమాలకు సాధ్యమైనంత దూరాంగా ఉండే నిర్మాతలలో ఒకరు దిల్ రాజు(Dil Raju). తన కెరీర్ మొత్తం చూసుకుంటే అత్యధిక శాతం స్టార్ హీరోలతో అయినా, మీడియం రేంజ్ హీరోలతో అయినా తక్కువ బడ్జెట్ సినిమాలే చేస్తూ, కేవలం కంటెంట్ ని నమ్మి మాత్రమే సినిమాలు చేసేవాడు. మొట్టమొదటిసారి ఆయన తన స్కూల్ ని దాటి శంకర్ లాంటి డైరెక్టర్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ని హీరో గా పెట్టి ‘గేమ్ చేంజర్'(Game Changer) లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని చేసి చేతులు కాల్చుకున్నాడు. సమయానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అదే సీజన్ లో విడుదలై సూపర్ హిట్ అవ్వబట్టి సరిపోయింది. లేకపోతే దిల్ రాజు పరిస్థితి ఎవ్వరూ ఊహించని స్థితికి పడిపోయేది. ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. జీవితం లో ఒకే ఒక్కసారి రిస్క్ చేస్తే ఆయన పరిస్థితి ఇలా అయ్యింది.
ఈ దెబ్బకి ఇక భవిష్యత్తులో దిల్ రాజు భారీ బడ్జెట్ చిత్రాలు చేయడని అనుకున్నారు. ఆయన కూడా ఇదే విషయాన్ని అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. కానీ ఇంతలోపే మనసు మార్చుకున్నాడో, లేదా మాట వరుసకు అన్నాడో, లేదా ఎప్పటి నుండో చేయాలనీ ఫిక్స్ అయిన ప్రాజెక్ట్ అనేది తెలియదు కానీ, ప్రశాంత్ నీల్(Prashanth Neel), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కాంబినేషన్ లో ‘రావణం’ అనే చిత్రం చేయవుతున్నట్టు దిల్ రాజు నేడు జరిగిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. ఇది ఒక మైథలాజికల్ సబ్జెక్ట్ అట. భారీ బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం. అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్స్ కలిపే 300 కోట్లు ఉంటుంది. ఇక అంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా మేకింగ్ కి కనీసం 400 కోట్ల రూపాయిల వరకు అవ్వొచ్చు. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ కి 700 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుంది.
మరి దిల్ రాజు ఒకసారి దెబ తిన్న తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధం గా ఉన్నాడా?, ఇది కూడా ‘గేమ్ చేంజర్’ లాగా అవ్వదని గ్యారంటీ ఏమిటి? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది క్యాలండర్ మొత్తం మీడియం రేంజ్ సినిమాలకు కేటాయించామని, రెండు మూడు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలకు స్క్రిప్ట్ సిద్ధం చేశామని, ఇవి 2026 వ సంవత్సరం లో మొదలు అవుతాయట. అందులో రామ్ చరణ్ తో ఒక సినిమా ఉందంటూ రీసెంట్ గా జరిగిన ‘తమ్ముడు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. మళ్ళీ దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.