Mahesh Babu: మహేష్ బాబు ను ఆ విషయం లో తక్కువ అంచనా వేశారా..?

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేశాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Written By: Gopi, Updated On : January 17, 2024 6:06 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఇక ఒక్కడు సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పోకిరి, దూకుడు లాంటి వరుస సక్సెస్ లతో ఆయన టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక మహర్షి, భరత్ అనే నేను లాంటి సినిమాలతో క్లాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించాడు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేశాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడం మహేష్ బాబు అభిమానులకి బాధను కలిగించింది. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా కలెక్షన్లలో తన దూకుడును చూపిస్తుందనే చెప్పాలి. ఇక ఈ మూవీ నాలుగు రోజుల్లోనే 200 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టి ఒక కొత్త శకానికి దారి చూపుతుందనే చెప్పాలి. ఏ సినిమా అయిన సక్సెస్ టాక్ వస్తే భారీ వసూళ్లను సాధిస్తుంది. కానీ మహేష్ బాబు సినిమా డివైడ్ టాక్ వచ్చిన కూడా మంచి వసూళ్లను సాధిస్తుందంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా చాలామంది జనాలు మహేష్ బాబుని చూడడానికి మాత్రమే థియేటర్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక కొన్ని ఊర్లల్లో అయితే ట్రాక్టర్లు వేసుకొని మరి ఈ సినిమాకి వెళ్తున్నట్టుగా కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి. ఇక దాన్ని బట్టి చూస్తే మహేష్ బాబు ని అభిమానించే అభిమానుల సంఖ్య లక్షల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక డివైడ్ టాక్ వస్తేనే ఇన్ని కలెక్షన్స్ వస్తున్నాయి అంటే మహేష్ బాబు సినిమాకి సక్సెస్ టాక్ వస్తే మాత్రం ఇండస్ట్రీ లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అవ్వాల్సిందే అంటూ మహేష్ అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు కమర్షియల్ గా మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి…